AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ఆ దేశం ఇండియాకు గట్టి పోటీనివ్వలేదు.. అలా అని తేలికగా తీసుకోవద్దు..

టీ 20 ప్రపంచ కప్‎లో అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నెషనల్ స్టేడియం వేదికగా భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‎తో తలపడనుంది. ఈ మ్యాచ్‎పై ఇరు దేశాల మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. మాజీ క్రికెట్ అజిత్ అగర్కార్ మాట్లాడుతూ పాకిస్తాన్‎తో భార‎త్‎కు ముప్పు ఏమి ఉండదన్నారు...

T20 World Cup: ఆ దేశం ఇండియాకు గట్టి పోటీనివ్వలేదు.. అలా అని తేలికగా తీసుకోవద్దు..
Agarkar
Srinivas Chekkilla
|

Updated on: Oct 17, 2021 | 4:32 PM

Share

టీ 20 ప్రపంచ కప్‎లో అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నెషనల్ స్టేడియం వేదికగా భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‎తో తలపడనుంది. ఈ మ్యాచ్‎పై ఇరు దేశాల మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. మాజీ క్రికెట్ అజిత్ అగర్కార్ మాట్లాడుతూ పాకిస్తాన్‎తో భార‎త్‎కు ముప్పు ఏమి ఉండదన్నారు.” టీం ఇండియా ప్రస్తుత ఫామ్ పరిగణలోకి తీసుకుంటే పాకిస్తాన్ ఇండియాకు సవాల్ విసురుతుందని నేను అనుకోను” అని అన్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు పాకిస్తాన్‎ను తేలికగా తీసుకొవద్దని చెప్పారు. ఈ పొట్టి ఫార్మాట్‌లో ఏదైనా జరగొచ్చని తెలిపాడు.

” ఎప్పుడైనా ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వెయ్యొద్దు. ఎందుకంటే క్రికెట్ ఒక విచిత్ర ఆట, ఏ సమయంలోనైనా ముఖ్యంగా టీ 20 ఫార్మాట్‌లో పరిస్థితులు మారవచ్చు” అని అగార్కర్ తెలిపారు. అగార్కర్ 2007 దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్‎ను గుర్తుచేసుకున్నాడు. ఉత్కంఠభరితమైన ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించి కప్ గెలిచిందని చెప్పారు. ఇండో- పాక్‌ మ్యాచ్‌ అంటే… భావోద్వేగాల సమాహారం. వరల్డ్‌కప్‌ అంటే అంచనాలు వేరే లెవల్‌లో ఉంటాయని తెలిపారు.

భారత్ పాక్ మ్యాచ్‎పై మరో మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా మాట్లాడారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ టీం భారత్‌ను ఓడించే అవకాశం లేదని తెలిపారు. కిస్తాన్ టీం భారత్‌ను టీ 20, వన్డే – ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు ఓడించలేదు. వన్డే వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ ఏడు మ్యాచుల్లో భారత జట్టే విజయం సాధించింది. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్‌లలో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచులు జరిగాయి. ఇందులో భారత్ 4-0 రికార్డును కలిగి ఉంది. 2007 లో మెన్ ఇన్ బ్లూ బౌల్ ఔట్ పోటీలోనూ గెలిచింది. దీంతో ఐదో మ్యాచుల్లోనూ విజయం సాధించింది.

మ్యాచ్‌లో నిర్భయంగా ఆడడమే పాకిస్థాన్‌ విజయ అవకాశాలకు కీలకమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ చెప్పారు. భారత్‌.. వన్డే ప్రపంచకప్‌లో గానీ, టీ20 ప్రపంచకప్‌లోనూ గానీ ఎప్పుడూ పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోలేదని చెప్పారు. పాక్ టోర్నమెంట్లో జోరందుకోవడానికి భారత్‌తో మ్యాచ్‌ కీలకమన్నారు. భారత్ బలమైన జట్టు అని అందులో అనేక మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారన తెలిపారు. ” కానీ మనం భయం, ఒత్తిడి లేకుండా ఆడితే ఇండియాను ఓడించగలం” అని ఆయన అన్నారు. ఈవెంట్‌లో పాకిస్థాన్ జట్టు బాగా రాణించగల సామర్థ్యం ఉందని మియాందాద్ అభిప్రాయపడ్డారు.

టీ 20 ప్రపంచకప్ జట్టు సభ్యులు భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్.

Read Also.. MS Dhoni: ధోనీ వచ్చే సీజన్‎లో ఆడాలి.. ఆ తర్వాత రిటైర్ అవ్వాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..