AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా కోచ్‌ ఆఫర్‌ని తిరస్కరించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌.. ఎందుకో తెలుసా..?

Cricket News: టీ 20 ప్రపంచకప్ -2021 తర్వాత ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవి నుంచి తప్పుకుంటారు. దీంతో BCCI కొత్త కోచ్‌ని వెతికే పనిలో నిమగ్నమైంది. ఈ విషయంలో

టీమిండియా కోచ్‌ ఆఫర్‌ని తిరస్కరించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌.. ఎందుకో తెలుసా..?
Ricky Ponting
uppula Raju
|

Updated on: Oct 17, 2021 | 4:21 PM

Share

Cricket News: టీ 20 ప్రపంచకప్ -2021 తర్వాత ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవి నుంచి తప్పుకుంటారు. దీంతో BCCI కొత్త కోచ్‌ని వెతికే పనిలో నిమగ్నమైంది. ఈ విషయంలో బీసీసీఐ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, ఢిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌తో మాట్లాడింది. కానీ ఈ ఈ ఆస్ట్రేలియన్ బీసీసీఐ ఆఫర్‌ని తిరస్కరించాడని తెలిసింది. అయితే కోచ్ పదవిని అంగీకరించకపోవడానికి కారణాలేంటో మాత్రం చెప్పలేదు. దీంతో ఇప్పుడు భారత తదుపరి కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడే అని అందరు నమ్ముతున్నారు.

ఢిల్లీతో అద్భుతాలు పాంటింగ్ పర్యవేక్షణలో ఐపీఎల్‌లో ఢిల్లీ అద్భుతాలు చేసింది. వరుసగా మూడు సార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇంతకుముందు ఈ జట్టు చాలా బలహీనంగా ఉండేది. కానీ ఇప్పుడు మారిపోయింది. ఈ జట్టు 2019 నుంచి ప్లేఆఫ్స్‌లో నిరంతరం ఆడుతోంది. గత సంవత్సరం జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈసారి జట్టు టైటిల్‌ని సాధిస్తుందని అనుకున్నారు. కానీ ముంబై ఇండియన్స్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. పాంటింగ్ తన కెప్టెన్సీలో రెండుసార్లు ఆస్ట్రేలియాను ప్రపంచ ఛాంపియన్‌గా చేశాడు. 2003, 2007లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచింది.

దరఖాస్తులను ఆహ్వానిస్తోన్న BCCI సీనియర్ జట్టు కోచ్ పదవికి బీసీసీఐ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. టీ 20 వరల్డ్ కప్ తర్వాత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌తో సహా శాస్త్రితో కలిసి పనిచేస్తున్న సహాయక సిబ్బంది అంతా వీడ్కోలు పలుకుతారు. ద్రవిడ్ తదుపరి ప్రధాన కోచ్ అవుతాడనే వార్తల మధ్య, పరాస్ మహాంబ్రే తదుపరి బౌలింగ్ కోచ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మిగిలిన పోస్టులలో ఏ వ్యక్తులు ఎంపికవుతారో వేచి చూడాలి.

Alai Balai: పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీకి సై అంటున్న దత్తన్న వారసురాలు.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతానంటున్న విజయలక్ష్మి