MS Dhoni: ధోనీ వచ్చే సీజన్‌లో ఆడాలి.. ఆ తర్వాత రిటైర్ అవ్వాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌లో కూడా ఆడాలని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. IPL 2020 లో నిరాశ తరువాత, IPL 2021 ఫైనల్‌లో సీఎస్కే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ని 27 పరుగుల తేడాతో ఓడించి ధోనీ తన జట్టును మరో టైటిల్‌ను అందించాడని చెప్పారు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌లో కూడా ఆడాలని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. IPL 2020 లో నిరాశ తరువాత, IPL 2021 ఫైనల్‌లో సీఎస్కే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ని 27 పరుగుల తేడాతో ఓడించి ధోనీ తన జట్టును మరో టైటిల్‌ను అందించాడని చెప్పారు. ధోనీ సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యంగా ఉందన్నారు. భారత జట్టుకు నాయకత్వం వహించి ప్రపంచ కప్ సాధించిన ధోనీ చైన్నై తరఫున మరో సీజన్ ఎందుకు ఆడకూడదని అన్నారు. “చెన్నైలో అతనికి ఇంకా ఒక సంవత్సరం మిగిలి ఉందని నేను భావిస్తున్నాను. అతను వచ్చే సీజన్‌లో ఆడాలి, ఆపై రిటైర్ కావాలి.” అని సెహ్వాగ్ అన్నాడు.
ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌ను తొమ్మిదిసార్లు ఫైనల్‌కు తీసుకెళ్లాడు. నాలుగు టైటిళ్లు సాధించిపెట్టాడని చెప్పాడు “కెప్టెన్ వారసత్వం అతను గెలిచిన ట్రోఫీల సంఖ్యకు ప్రసిద్ధి చెందింది. ఎంఎస్ ధోనీ నాలుగు టైటిల్స్ గెలిచి 9 ఫైనల్స్ ఆడాడు. అతనితో సరిపోల్చుకోవడం ఎవరికి సాధ్యం కాదు. రోహిత్ శర్మ ధోనీకి దగ్గరగా ఉన్నాడు కానీ 9 సీజన్ ఫైనల్స్ ఆడాలంటే అతనికి మరింత సమయం కావాలి “అని సెహ్వాగ్ అన్నాడు. చెన్నై రెండు సీజన్లలో నిషేధించబడినప్పటికీ ధోనీ ఆ జట్టుని గాడిలో పెట్టాడు.
“నిస్సందేహంగా, చెన్నై సూపర్ కింగ్స్ ఈ టీ 20 టోర్నమెంట్‌లో అత్యుత్తమ జట్టు. వారు గత సంవత్సరం పట్టిక దిగువన నిలిచారు. అంతకు ముందు వారు 2 సంవత్సరాల పాటు నిషేధించబడ్డారు. కాబట్టి 13-14 సంవత్సరాలలో మూడుసార్లు వారు పోటీకి దూరంగా ఉన్నారు. కానీ మిగిలిన సీజన్లలో, వారు ప్లేఆఫ్‌లో ఆడారు. తొమ్మిదిసార్లు ఫైనల్‌కు చేరుకున్నారు. “అని సెహ్వాగ్ చెప్పాడు.