T20 World Cup 2021: 16 జట్లు.. 45 మ్యాచ్‌లు.. 28 రోజులు.. నేటి నుంచే టీ 20 ప్రపంచకప్.. అందరి చూపు ఆ మ్యాచ్‌పైనే..!

బీసీసీఐ ఆతిథ్యమిచ్చే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ టోర్నమెంట్ ఒమన్, యూఏఈలో నేటి నుంచి మొదలుకానుంది.

T20 World Cup 2021: 16 జట్లు.. 45 మ్యాచ్‌లు.. 28 రోజులు.. నేటి నుంచే టీ 20 ప్రపంచకప్.. అందరి చూపు ఆ మ్యాచ్‌పైనే..!
T20 World Cup 2021
Follow us

|

Updated on: Oct 17, 2021 | 2:23 PM

ICC T20 World Cup 2021: ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, టీ 20 ప్రపంచకప్ ఎట్టకేలకు నేటి నుంచి (ఆదివారం) ప్రారంభం కానుంది. 16 జట్లు పొట్టి ఫార్మాట్‌లో తలపడనున్నాయి. ఐపీఎల్ 2021 ముగిసిన తరువాత టీ20 ప్రపంచకప్‌ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో కలిసి ఆడే ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్‌‌లో ఒకరికొకరు వ్యతిరేకంగా పోరాడనున్నారు. 2016 తర్వాత ఈ టోర్నమెంట్ గతేడాది నిర్వహించాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా ఒక సంవత్సరం పాటు వాయిదా పడింది. టీ20 ప్రపంచ కప్‌ 2021 భారతదేశంలో జరగాల్సి ఉంది. కానీ, దేశంలో కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఒమన్‌, యూఏఈలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.

అక్టోబర్ 17 న జరిగే అర్హత రౌండ్‌తో టీ 20 ప్రపంచకప్ ప్రారంభమవుతుంది. మొదటి రోజు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గ్రూప్ బీ మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్, పాపువా న్యూ గినియా తలపడతాయి. బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్‌తో తలపడుతుంది. ఎనిమిది జట్లు క్వాలిఫైయింగ్ రౌండ్‌లో పాల్గొంటున్నాయి. వీటిలో నాలుగు జట్లు సూపర్ 12 కి చేరుకుంటాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ పరంగా, టాప్ 12 జట్లకు సూపర్ 12 లోకి నేరుగా ప్రవేశం లభించింది. ఈ 8 జట్లు సూపర్ 12 మ్యాచ్‌లతో ప్రచారాన్ని ప్రారంభిస్తాయి.

పాకిస్థాన్‌తో గ్రూప్ బీలో భారత్.. యూఏఈలో ఈ జట్లు అభిమానుల సమక్షంలో టైటిల్ కోసం సవాలు చేస్తాయి. ఐపీఎల్ లాగా టీ20 ప్రపంచ కప్ కోసం అభిమానులు కూడా స్టేడియానికి వచ్చేందుకు అనుమతి ఉంది. ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో జరుగుతాయి. టీ 20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు గ్రూప్ 2 లో భారత్ స్థానం పొందింది. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్‌లో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రపంచకప్‌లో గ్రూప్ 2 లో భారత్, పాకిస్థాన్‌లు చోటు దక్కించుకున్నాయి.

నాకౌట్ రౌండ్ సెమీ ఫైనల్స్ నుంచి ప్రారంభమవుతుంది. టోర్నమెంట్ నాకౌట్ దశ సూపర్ 12 రౌండ్ తర్వాత ప్రారంభమవుతుంది. 12 జట్లలో నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. టోర్నమెంట్‌లో మొదటి సెమీ ఫైనల్ నవంబర్ 10 న జరుగుతుంది. రెండవ సెమీ ఫైనల్ నవంబర్ 11 న జరుగుతుంది. తుది మ్యాచ్ నవంబర్ 14 న దుబాయ్‌లో జరుగుతుంది. నవంబర్ 15 ఫైనల్ కోసం రిజర్వ్ డేగా ఉంచబడింది.

Also Read: T20 World Cup 2021: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై తొలిసారి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఏమన్నాడంటే?

IND vs PAK: ‘మాతో ఆడితే మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.. జర జాగ్రత్త’: షోయబ్ అక్తర్‌కు వార్నింగ్ ఇచ్చిన టీమిండియా మాజీ ప్లేయర్