పొరపాటున మీ డబ్బు వేరొకరి ఖాతాకి వెళ్లిందా..! అయితే ఆర్బీఐ ఏం చెబుతుందో తెలుసుకోండి..

RBI Rules: మొబైల్‌ బ్యాంకింగ్‌ వచ్చినప్పటి నుంచి అందరు సులువుగా డబ్బులు బదిలీ చేస్తున్నారు. దీంతో పాటు ఆన్‌లైన్‌ మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి.

పొరపాటున మీ డబ్బు వేరొకరి ఖాతాకి వెళ్లిందా..! అయితే ఆర్బీఐ ఏం చెబుతుందో తెలుసుకోండి..
Money Transfer
Follow us
uppula Raju

|

Updated on: Oct 17, 2021 | 5:34 PM

RBI Rules: మొబైల్‌ బ్యాంకింగ్‌ వచ్చినప్పటి నుంచి అందరు సులువుగా డబ్బులు బదిలీ చేస్తున్నారు. దీంతో పాటు ఆన్‌లైన్‌ మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. కానీ UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్‌లు బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఇబ్బందులను చాలావరకు తగ్గించాయని చెప్పవచ్చు. డబ్బు బదిలీ ఇప్పుడు కేవలం మొబైల్ ఫోన్‌తో సులభంగా జరిగిపోతుంది. అయితే మీరు డబ్బులు బదిలీ చేసేటప్పుడు పొరపాటున వేరొకరి ఖాతాకు వెళ్లాయనుకో కంగారుపడాల్సిన అవసరం లేదు. డబ్బులు తిరిగి వచ్చేలా ప్రయత్నించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

వెంటనే బ్యాంకుకు తెలియజేయండి మీరు పొరపాటున వేరొకరి ఖాతాకు డబ్బు బదిలీ చేసినట్లయితే ఈ విషయం వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి. లేదంటే కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేసి జరిగినదంతా చెప్పండి. ఒకవేళ బ్యాంక్ అన్ని వివరాలను ఈ-మెయిల్ ద్వారా అడిగినట్లయితే తప్పు లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలను మెయిల్‌ చేయండి. లావాదేవీ జరిగిన తేదీ, సమయం, మీ అకౌంట్ నంబర్‌తో పాటు, పొరపాటున బదిలీ చేసిన అకౌంట్‌, బ్యాంకుపేరుని తెలపండి.

మీ బ్యాంకులో బదిలీ జరిగితే .. ఒకవేళ మీరు తప్పు అకౌంట్‌కి లేదా IFSC కోడ్ కలిగి ఉన్న తప్పుడు బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేసినట్లయితే మీ ఖాతాకు డబ్బు ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. ఒకవేళ ఇది జరగకపోతే మీ బ్యాంక్‌ని సందర్శించి బ్రాంచ్ మేనేజర్‌ని కలవండి. తప్పు లావాదేవీ గురించి తెలియజేసి డబ్బు ఎక్కడికి పోయిందో చెప్పండి. అయితే మీ సొంత బ్యాంకులోనే తప్పు లావాదేవీ జరిగితే అది మీ ఖాతాకు త్వరగా జమ అవుతుంది.

వేరే బ్రాంచి ఖాతాకి బదిలీ అయితే? పొరపాటున మీ డబ్బు వేరే బ్యాంక్ ఖాతాకి బదిలీ అయితే రికవరీకి ఎక్కువ సమయం పట్టవచ్చు. కొన్నిసార్లు బ్యాంకులు అటువంటి వివాదాలను పరిష్కరించడానికి రెండు నెలల వరకు సమయం తీసుకుంటాయి. ఏ నగరంలో ఏ బ్యాంకులో ఏ ఖాతాలో డబ్బు బదిలీ చేయబడిందో మీరు తెలుసుకోవచ్చు. మీరు ఆ శాఖను సంప్రదించడం ద్వారా మీ డబ్బును పొందడానికి ప్రయత్నించవచ్చు. తప్పుగా పంపిన డబ్బును తిరిగి ఇవ్వమని బ్యాంక్ సదరు వ్యక్తిని అడుగుతుంది.

కోర్టుకు కూడా వెళ్లవచ్చు బ్యాంక్ మీ మాట వినకపోతే మీ డబ్బును తిరిగి పొందడానికి మీరు కోర్టుకు కూడా వెళ్లవచ్చు. ఒకవేళ పొరపాటున డబ్బును ఎవరి అకౌంట్‌కు పంపినా తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే అతనిపై కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఈ కేసు రిజర్వ్ బ్యాంక్ చట్టాల ఉల్లంఘనగా పరిగణిస్తారు. పొరపాటున వేరొకరి ఖాతాలో డబ్బు జమ అయితే బ్యాంకులు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఆర్‌బిఐ గతంలోనే ఆదేశించింది. తప్పు ఖాతా నుంచి సరైన ఖాతాకు డబ్బును బదిలీ చేయడం బ్యాంకు బాధ్యతగా సూచించింది.

Thyroid: థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది.. వస్తే బరువు పెరుగుతారా.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి..