Instagram: మార్క్ జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. టీనేజర్స్ కోసం వేల కోట్ల ఖర్చు..
2018లో ఇన్‌స్టాగ్రామ్ 1 బిలియన్ వినియోగదారులకు చేరుకున్నప్పుడు, ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ దీనిని అద్భుతమైన విజయంగా అభివర్ణించారు. అయితే జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రశంసించినప్పటికీ..
2018లో ఇన్‌స్టాగ్రామ్ 1 బిలియన్ వినియోగదారులకు చేరుకున్నప్పుడు, ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ దీనిని అద్భుతమైన విజయంగా అభివర్ణించారు. అయితే జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రశంసించినప్పటికీ.. 2018 మార్కెటింగ్ ప్రెజెంటేషన్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ టీనేజ్ యూజర్స్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు మారుతున్నారు. దీనిపై కంపెనీ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్ అంతర్గత పత్రాలు బయటకు వచ్చాయిని.. ఇన్‌స్టాగ్రామ్‌ను వదిలేస్తున్న టీనేజ్ యూజర్స్ పెరుగుతున్నారని ఆ పత్రాల్లో ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్..ఇన్‌స్టాగ్రామ్ టీనేజీ అమ్మాయిలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందంటూ ‘ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్‌లైన్’ పేరుతో నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక బయటకు రావడంతో ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు తగ్గుతున్నారు. చేజారిపోతున్న యజర్లను ఆకర్షించేందుకు, కొత్త యూజర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేయాలని మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయించారటా. ఇన్‌స్ట్రాగ్రామ్ ఈ ఏడాది వార్షిక యాడ్ బడ్జెట్‌లో టీనేజ్ యూజర్స్ కోసం సుమారు 390 మిలియన్ డాలర్లను (ఇండియన్ కరెన్సీలో రూ. 29,26,36,50,000) యాడ్స్ రూపంలో మార్క్‌జుకర్ బెర్గ్ ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎక్కువగా డిజిటల్ ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలని చూస్తున్నారు. ముఖ్యం 20 ఏళ్ల పైబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
వినియోగదారుల మానసిక ఆరోగ్యంపై ఇన్‌స్టాగ్రామ్ ప్రభావాలపై కాంగ్రెస్, ప్రజల నుండి ఆగ్రహాం వస్తోంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం ఫేస్‌బుక్ విజిల్ బ్లోయర్, ఫ్రాన్సిస్ హౌగెన్ నుంచి వచ్చిన ప్రత్యేక డాక్యుమెంట్‌ల ప్రకారం కొంతమంది టీనేజ్ అమ్మాయిలు ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు వారి శరీర ఇమేజ్ గురించి బాధపడుతున్నట్లు తేలింది. 1.3 బిలియన్లకు పైగా వినియోగదారులతో ఇన్‌స్టాగ్రామ్ అతిపెద్దదిగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇన్ స్ట్రాగ్రామ్ నుంచి టిక్‌టాక్ 1 బిలియన్ యూజర్సు, స్నాప్‌చాట్ 500 మిలియన్లు యూజర్స్ చేరారు. వారి ఇతర వాటి వెళ్లకుండా ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్‌పై భారీ ఖర్చు పెట్టనుంది. ముఖ్యంగా టీనేజ్ యూజర్లు తగ్గిపోవడంపై ఇన్ స్ట్రాగ్రామ్ ముప్పుగా భావిస్తోంది. అందుకే యాడ్స్ లేదా, ఇతర మార్కెటింగ్ స్ట్రాటజీల్లో 13 నుంచి 15 సంవత్సరాల వయస్సున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న కిడ్స్ యూజర్ బేస్ పెంచుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ పేరుతో యాప్‌ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఆ యాప్‌ను బిల్డ్ చేయడం నిలిపివేసినట్లు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసేరి తెలిపారు.
ఈ సంవత్సరం ఆర్థిక సేవల సంస్థ పైపర్ శాండ్లర్ నిర్వహించిన ఒక సర్వేలో 35% మంది టీనేజర్‌లు స్నాప్‌చాట్ తమ అభిమాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా చూస్తున్నట్లు చెప్పారు. 30% మంది టిక్‌టాక్ వైపు మొగ్గు చూపారు. ఇన్‌స్టాగ్రామ్ 22%తో మూడవ స్థానంలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ తన మార్కెటింగ్ బడ్జెట్ మొత్తాన్ని టీనేజర్స్‌పై కేంద్రీకరించిందనేది నిజం కాదని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి లిజా క్రెన్‌షా ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా టీనేజర్లను కలిగి ఉండటం ఆశ్చర్యకరమైనది కాదు, “టీనేజ్‌లు మా ముఖ్యమైన కమ్యూనిటీలలో ఒకటి, ఎందుకంటే వారు ట్రెండ్‌లను గుర్తించి సెట్ చేస్తారు” అని చెప్పారు. సెప్టెంబర్ 2018 లో, ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకులు కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్, జుకర్‌బర్గ్‌తో గొడవపడిన తర్వాత ఫేస్‌బుక్‌ను విడిచిపెట్టారు. దీర్ఘకాల ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ అయిన మోసేరి ఇన్‌స్టాగ్రామ్‌కి నాయకత్వం వహించారు.
Read Also.. Credit Card: ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్.. ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం