Credit Card: ఈ క్రెడిట్‌ కార్డు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం

Credit Card: ప్రస్తుతం బ్యాంకులు కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి. ఇక క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. కొత్త క్రెడిట్‌ కార్డు తీసుకోవాలని..

Credit Card: ఈ క్రెడిట్‌ కార్డు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం
Follow us
Subhash Goud

|

Updated on: Oct 17, 2021 | 2:49 PM

Credit Card: ప్రస్తుతం బ్యాంకులు కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి. ఇక క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. కొత్త క్రెడిట్‌ కార్డు తీసుకోవాలని అనుకునేవారికి అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులో ఉంది. దీని పేరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్‌బీఎల్ బ్యాంక్ వరల్డ్ ప్లస్ సూపర్ కార్డు. దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్‌ ఉన్నాయి. ఆర్‌బీఎల్ బ్యాంక్.. బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్యంతో ఈ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కార్డు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్రెడిట్, క్యాష్, లోన్, ఈఎంఐ వంటి నాలుగు రకాల బెనిఫిట్స్ ఈ కార్డుపై పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

ఈ కార్డు ఉన్నవారు రూ.3 వేలకు పైన లావాదేవీలకు ఈఎంఐ రూపంలోకి మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఈ కార్డు కలిగిన వారు పర్సనల్ లోన్ కూడా పొందవచ్చు. కార్డు క్యాష్ లిమిట్ ప్రాతిపదికన లోన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 2.5 శాతం ఉంటుంది. వడ్డీ ఉండదు.

ఏటీఎం నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చు..

అలాగే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. 50 రోజుల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ టైమ్ లభిస్తుంది. అలాగే ఈ కార్డుపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా ఉంటాయి. మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ లేదా ఆర్‌బీఎల్ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు బ్యాంకును సంప్రదించి తెలుసుకోవచ్చు. అయితే వివిధ బ్యాంకులు కూడా క్రెడిట్‌ కార్డులపై ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పండగ సీజన్‌లో క్రెడిట్‌ కార్డులపై క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్‌, ఇతర ఆఫర్లను కల్పిస్తున్నాయి.

లావాదేవీల్లో జాగ్రత్త..

కాగా, ఈ మధ్య కాలంలో క్రెడిట్‌ కార్డుల విషయంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. క్రెడిట్‌ కార్డులు వాడేవారి సంఖ్య పెరిగిపోతుండటంతో మోసగాళ్లు కన్నేసి ఉంచుతున్నారు. కార్డు వివరాలు, వ్యక్తిగత వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్‌ కార్డులకు సంబంధించి ఫోన్‌ చేస్తున్నామని వినియోగదారులకు నిలువునా మోసగిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Busines Ideas: కేంద ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల రుణంతో నెలకు రూ.50వేలు సంపాదించవచ్చు.!

Flipkart Big Diwali Sale 2021: ‘బిగ్‌ దివాళీ సేల్‌’తో ముందుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్‌.. అదిరిపోయే ఆఫర్లు..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!