- Telugu News Photo Gallery Business photos Flipkart Big Diwali Sale 2021: Flipkart Diwali Sale Offers and Dates.. 17 23 October 2021
Flipkart Big Diwali Sale 2021: ‘బిగ్ దివాళీ సేల్’తో ముందుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్.. అదిరిపోయే ఆఫర్లు..!
Flipkart Big Diwali Sale 2021: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసింది. ఇందులో ఎన్నో ఆఫర్లు సొంతం చేసుకున్నారు కస్టమర్లు. ఇక దీపావళి సందర్భంగా మరో..
Updated on: Oct 24, 2021 | 1:36 PM

Flipkart Big Diwali Sale 2021: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసింది. ఇందులో ఎన్నో ఆఫర్లు సొంతం చేసుకున్నారు కస్టమర్లు. ఇక దీపావళి సందర్భంగా మరో బంపర్ ఆఫర్‌లతో ముందుకు వస్తోంది ఫ్లిప్‌కార్ట్. 'బిగ్ దివాళీ సేల్' పేరుతో అక్టోబర్ 17 ప్రారంభమై అక్టోబర్ 23తో ముగియనుంది.

ఈ దివాళీ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై 80 శాతం, 70శాతం డిస్కౌంట్‌లో అందించనుంది. వీటితో పాటు పలు బ్యాంకుల డెబిట్ కార్డ్, క్రెడిట్ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ అధికారికంగా వెల్లడించింది. ప్రైమ్ మెంబర్స్‌కు ప్రత్యేకంగా ఒక రోజు ముందుగానే అంటే 16వ తేదీ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. మిగిలిన కొనుగోలుదారులు అక్టోబర్ 17 నుంచి ఈ ఆఫర్లు అంబాటులోకి రానున్నాయి.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేసినా ఈఎంఐ సదుపాయంతో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే యాక్సెస్ బ్యాక్ , ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగంతో 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక పేటీఎం యూపీఐ లావాదేవీలపై ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పొందవచ్చు. ఫోన్‌పే యూజర్లు కూడా క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

బిగ్ దివాళీ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్‌పై 80శాతం డిస్కౌంట్స్, టీవీ, గృహోపకరణాలపై 75శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.





























