Busines Ideas: కేంద ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల రుణంతో నెలకు రూ.50వేలు సంపాదించవచ్చు.!

Business Ideas: ప్రతి నెల రాబడి పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గాలను కల్పిస్తోంది. వ్యాపారం చేసుకుని మంచి అభివృద్ధి..

Busines Ideas: కేంద ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల రుణంతో నెలకు రూ.50వేలు సంపాదించవచ్చు.!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 17, 2021 | 2:23 PM

Business Ideas: ప్రతి నెల రాబడి పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గాలను కల్పిస్తోంది. వ్యాపారం చేసుకుని మంచి అభివృద్ధి సాధించుకునేందుకు వివిధ రకాల స్కీమ్‌లను అందిస్తోంది. ఇక పాల ఉత్పత్తి సంస్థ మదర్ డెయిరీ తమతో వ్యాపారం చేసేందుకు పెద్ద ఎత్తున యువతకు అవకాశం కల్పిస్తోంది. ప్రధాని మోదీ అందిస్తున్న ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా యువత స్వయం ఉపాధి దిశగా కదులుతున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముద్ర రుణాలతో పలు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సాహం అందిస్తోంది. అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని మదర్ డెయిరీ సంస్థ కూడా ఫ్రాంచైజీని ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా కంపెనీ పాలు, పాల ఉత్పత్తులు మరియు ఇతర ఆహార ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంది. పాల ఉత్పత్తులతో పాటు, పండ్లు, కూరగాయలు, వంట నూనెలు, తినుబండారాలు, ఊరగాయలు, పండ్ల రసాలు, జామ్‌లు వంటి వాటిని కూడా కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.

2019 సర్వేలో, భారతదేశంలోని టాప్ 100 ఉత్తమ కంపెనీల జాబితాలో కంపెనీ 39 వ స్థానంలో ఉంది. సంస్థ సుమారు 2500 రిటైల్ అవుట్‌లెట్లను కలిగి ఉంది.క్రమంగా నెట్‌వర్క్‌ను విస్తరించాలని యోచిస్తోంది. ఇటీవల, బేకరీ విభాగంలోకి తొలిసారిగా ప్రవేశించాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీ మూడు రకాల కేక్ లను విడుదల చేసింది. మీరు తక్కువ పెట్టుబడి మరియు మంచి లాభాలతో ఫ్రాంచైజ్ వ్యాపారం చేయాలని భావిస్తూ.. మీరు మదర్ డెయిరీతో కలిసి వెళ్లాలనుకుంటే. కేవలం 5 నుండి 10 లక్షలు మాత్రమే పెట్టుబడి సరిపోతుంది.

మదర్ డెయిరీ ఫ్రాంచైజ్ అంటే ఏమిటి?

చాలా కంపెనీలు తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని కోసం దేశ వ్యాప్తంగా ఫ్రాంచైజీలను అందిస్తుంది. పేరు కంపెనీదే అయినప్పటికీ, ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ కొంత కమీషన్ లేదా ఫీజు వసూలు చేస్తుంది. మదర్ డెయిరీ దేశంలో సుమారు 2500 అవుట్‌లెట్లను ప్రారంభించింది. ఇందులో మిల్క్ బూత్‌ ఫ్రాంచైజ్ మోడల్‌లో అనేక రకాల పాల ఉత్పత్తులను అమ్మవచ్చు.

మదర్ డెయిరీ ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ మాత్రమే తెరవగలదు. ఇందులో పెద్దగా పెట్టుబడి ఉండదు. ఫ్రాంచైజీల్లో అమ్మాల్సిన పాల ఉత్పత్తులు.. టోకెన్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, ప్రీమియం ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, స్టాండర్డైజ్డ్ మిల్క్, ఆవు పాలు, సూపర్ టీ మిల్క్, డైట్ మిల్క్, అల్టిమేట్ పెరుగు, క్లాసిక్ పెరుగు, మిస్టి పెరుగు, లస్సీ, ప్లెయిన్ మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్ బాటిల్, ఫ్రెష్ పన్నీర్ , వెన్న, జున్ను ముక్కలు, జున్ను, ఆవు నెయ్యి, పండ్ల పెరుగు, మిల్క్ వైటెనర్, మిల్క్ షేక్ వంటి ఉత్పత్తులను మదర్ డెయిరీ ఉత్పత్తి చేస్తోంది.

అయితే మీరు మదర్ డెయిరీ యొక్క ఫ్రాంచైజీని తీసుకోవాలనుకుంటే మీరు పెట్టుబడి పెట్టాలి. మీరు ఎంపిక చేసుకున్న స్థలాన్ని బట్టి ఈ పెట్టుబడి ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. మీకు సొంత దుకాణం ఉంటే, అప్పుడు కొంత డబ్బు ఆదా అవుతుంది. కాకపోతే, పెట్టుబడి తక్కువ కావచ్చు. ఫ్రాంచైజీ స్థాపనకు 5 నుండి 10 లక్షల రూపాయల పెట్టుబడి అవసరం. ఇందులో 50,000 రూపాయలను బ్రాండ్ ఫీజుగా విడిగా ఇవ్వాల్సి ఉంటుంది.

మదర్ డెయిరీ ఫ్రాంచైజీకి అవసరమైన పత్రాలు:

ఐడి ప్రూఫ్- ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడి కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు, ఫోటో, ఇమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఆస్తి పత్రాలు కూడా అవసరం. అయితే పెట్టుబడి మొత్తాన్ని పొందడానికి సుమారు 2 సంవత్సరాలు పడుతుంది. మదర్ డెయిరీలో పెట్టుబడి పెడితే ప్రతి నెలా సుమారు రూ. 44 వేల వరకు లబ్ధి పొందవచ్చు.

 ఇవీ కూడా చదవండి:

BSNL Bharat Fiber: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఉచితంగా నాలుగు నెలల ఇంటర్నెట్.. పూర్తి వివరాలు ఇవిగో..!

Petrol Diesel Price: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉందంటే..

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?
RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?