వాట్సాప్ ద్వారా మీ ఫోన్ హాకింగ్‌కు గురికావచ్చు. జాగ్రత్తలు తీసుకోకపోతే మీ అకౌంట్‌లో డబ్బు మాయం కావొచ్చు.
సైబర్ మోసగాళ్లు మీ వాట్సాప్‌లో ఉన్న గ్రూపుల్లో లింకులు పంపుతూ.. న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్ మెయిల్.
భారీ లాభాల ఆశజూపి డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్లు. డిజిటల్ అరెస్టుల పేరుతో భయబ్రాంతులకు గురిచేసి డబ్బు ట్రాన్స్‌ఫర్.
గూగుల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌లను వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా పెరుగుతున్న సైబర్ నేరాలు.
2023-24 సైబర్ మోసాల జాబితాను కేంద్ర హోంశాఖ విడుదల. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వాట్సాప్ వేదికగా జరిగిన మోసాలకు 43 వేల 797 ఫిర్యాదులు.
టెలిగ్రామ్‌లో మోసాలపై 22 వేల 680 కంప్లయింట్స్ వచ్చాయి. ఇన్‌స్టా వేదికగా జరిగిన నేరాలపై 19 వేల 800 కేసులు.
బ్యాంక్ అకౌంట్‌ను వాట్సాప్‌కు లింక్ చేసుకున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు టెక్ నిపుణులు.
వాట్సాప్ గ్రూపులలో వచ్చే లింకులను క్లిక్ చేయకపోవడమే మంచిదంటున్న నిపుణులు. గుర్తు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దని సూచిస్తున్నారు.