Macherla: సార్లొస్తున్నారని బంగారంలాంటి చెట్లు నరికేశారు..!
Macherla: బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో చెట్ల నరికివేత వృక్షో రక్షతి రక్షిత అన్న నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు అధికారులు. పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. మచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న చెట్లను నరికి వేశారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో విలువ వృక్షాలను అధికారులు నరికి వేయించడం చర్చనీయాంశంగా మారింది. వృక్షో రక్షతి రక్షిత అన్న నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. ఏపుగా పెరిగిన చెట్లను నరికివేశారు అధికారులు. బెల్లంపల్లి ఎంపిడివో కార్యాలయం ముందు నిర్మించిన మహిళా శక్తి క్యాంటీన్ ఓపెనింగ్ కు నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు వస్తున్నారంటూ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న దాదాపు 10 నుంచి 15 చెట్లను నరికి వేయించారు. టేకు చెట్లతో పాటు విలువైన భారీ వృక్షాలను నేల మట్టం చేశారు.
విచిత్రమేమంటే అదే చోట ప్రజాప్రతినిధులతో మొక్కలు నాటాలనే ఆలోచనలో అధికారులు ఉండటం అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కు నాంది పలికే చెట్లను నరికి వేయడం పట్ల స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెట్లు నరికి వేయించే ముందు అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. సదరు ఎంపిడివో అధికారి మాత్రం తనదే రాజ్యం అన్నట్లుగా భారీ వృక్షాలను నరికి వేయించారనే చెప్తున్నారు ఎంపిడివో కార్యాలయ సిబ్బంది.