TGSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ముందే రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..

తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.. మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి.. తాజాగా 50 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. హనుమకొండ హయగ్రీవ గ్రౌండ్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ జెండా ఊపి ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను ప్రారంభించారు.

TGSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ముందే రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
Tgsrtc Electric Buses
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 06, 2025 | 5:40 PM

తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.. మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి.. తాజాగా 50 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. హనుమకొండ హయగ్రీవ గ్రౌండ్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ జెండా ఊపి ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు బస్సులో కొంత దూరం ప్రయాణించారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

వరంగల్ ప్రాంతానికి మొత్తం 112ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు జరగగా.. మొదటి దశగా ఈరోజు 50 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించినట్లు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తెలిపారు. సంక్రాంతి లోపు మరో 25 బస్సులు రొడ్డెక్కనున్నాయి.. అనంతరం మిగిలిన బస్సులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

Tgsrtc Electric Buses

Tgsrtc Electric Buses

అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.. మహిళలు 4350 కోట్ల రూపాయల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారన్నారు. అక్యుపేన్సి గతంలో కంటే రెట్టింపు అయిందని.. ఆర్టీసీ ఉద్యోగుల వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు.. తెలంగాణ కోసం కోట్లడిన ఆర్టీసీ ఉద్యోగులు.. నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామని.. 3 వేల ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. వెయ్యి బస్సులు ఎలక్ట్రిక్ రాష్ట్రంలో ప్రారంభించుకున్నామని.. ఇప్పటికే హైదరాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ స్వతహాగా మరో 1000 బస్సులు కొనుగోలు చేస్తుందని..గత ప్రభుత్వం ఆర్టీసీ ని నిర్వీర్యం చేసిందని.. ముసేసే పరిస్థితి కి తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో అనేక సంస్కరణలు చేస్తూ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్య శ్రీ 5-10 లక్షలు మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, 2 లక్షల రైతు రుణమాఫీ, 40 శాతం డైట్ చార్జీలు పెంచామని.. సన్న వడ్ల కు 500 బోనస్ ఇచ్చామని మంత్రులు తెలిపారు.

5 వేల కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నామని.. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా 12 వేలు ఇస్తుందని పేర్కొన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని.. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రులు పేర్కొన్నారు. హైదరాబాద్ తరువాత అతి పెద్ద నగరంగా వరంగల్ ను తీర్చిదిద్దుతామని.. ఇప్పటికే ప్రణాళికలు చేసుకున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపి కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాగరాజు , ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి , ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..