Game Changer Pre Release Live: రాజమండ్రి గడ్డపై బాబాయ్, అబ్బాయ్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Game Changer Pre Release Event : ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన నటించిన లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రమోషన్లలో పాల్గొంటున్న చిత్రయూనిట్.. ఈరోజు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఈనెల 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇన్నాళ్లు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ శంకర్ మొదటి సారి తెలుగులోనూ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, టాలీవుడ్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.