Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అక్కడైనా కియారా కనిపిస్తుందా.. ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈరోజు రాజమండ్రిలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్.
మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. జనవరి 10న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలకాబోతుండగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు మేకర్స్. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు రానున్నారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు నిర్వహించనున్నారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మాత్రం గేమ్ ఛేంజర్ ప్రమోషన్లకు ముందు నుంచి దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉండడంతో కియారా అస్వస్థతకు గురైందని.. అందుకే ఆమె గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో పాల్గొనడం లేదని సమాచారం. కేవలం లక్నోలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో మాత్రమే కియారా సందడి చేసింది. ఆ తర్వాత మరె ప్రమోషన్ కార్యక్రమాల్లో కనిపించలేదు. ఇక ఇప్పుడు రాజమండ్రిలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కియారా కనిపిస్తుందా ? లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు కియారా అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది ఆమె పర్సనల్ టీం. కియారా ఆరోగ్యం సరిగ్గానే ఉందని.. ఆసుపత్రిలో చేరిందంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు.
ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ శంకర్ మొదటిసారి తెలుగులో రూపొందిస్తున్న సినిమా ఇదే. అలాగే చరణ్ ఫస్ట్ టైమ్ పొలిటికల్ బ్యాగ్రౌండ్ కథతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.