AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s T20 World Cup 2026: 10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..!

India Womens T20 World Cup 2026 SWOT Analysis: సమతూకంతో కూడిన ఆటగాళ్లు, సరికొత్త ఉత్సాహంతో ఉన్న యువ రక్తంతో భారత జట్టు సెమీఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే గాయాల వల్ల తలెత్తిన ఆల్‌రౌండర్ల కొరతను అధిగమించి, సీనియర్ ఆటగాళ్లు బాధ్యతాయుతంగా ఆడితే ఈసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీ ముద్దాడటం భారత్‌కు అసాధ్యమేమీ కాదు.

Women's T20 World Cup 2026: 10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..!
India Womens T20 World Cup 2026
Venkata Chari
|

Updated on: Jun 11, 2026 | 8:10 AM

Share

India Womens T20 World Cup 2026: వన్డే ప్రపంచకప్‌లో చారిత్రాత్మక విజయంతో మురిపించిన భారత మహిళల క్రికెట్ జట్టు, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సమరానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఈ పొట్టి ఫార్మాట్ యుద్ధంలో తొలిసారి ట్రోఫీని ముద్దాడాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పట్టుదలతో ఉంది. జూన్ 14న పాకిస్తాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌తో భారత్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.

తిరుగులేని బ్యాటింగ్ బలం.. అదరగొడుతున్న యువశక్తి..

భారత జట్టుకు ప్రధాన బలం వారి బ్యాటింగ్ లోతు. ఐదోసారి ప్రపంచకప్‌లో జట్టును నడిపిస్తున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అనుభవం అమూల్యమైంది. ఆమెకు తోడుగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ఇన్నింగ్స్ ఆరంభంలోనే విరుచుకుపడే షఫాలీ వర్మ, క్లాస్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారనున్నారు. చివర్లో విధ్వంసం సృష్టించేందుకు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో ఉన్న భారతి ఫుల్మాలి, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మిడిలార్డర్‌కు కొండంత అండగా నిలుస్తున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ద్వారా వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొని ఆడేందుకు తహతహలాడుతున్నారు.

ఇంగ్లాండ్ పిచ్‌లపై స్పిన్ మాయాజాలం..

ఈ టోర్నమెంట్‌లో భారత స్పిన్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణిల త్రయం ఇంగ్లాండ్ పిచ్‌లపై ప్రత్యర్థులను తిప్పికొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. వీరికి సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అనుభవం తోడవ్వడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్పిన్ దాడిని ఎంపిక చేయడం భారత జట్టుకు కలిసివచ్చే అంశం.

అనుభవలేమి.. గాయాల బెడద..

జట్టులో బలాలు ఎంత ఉన్నాయో, కొన్ని బలహీనతలు కూడా అంతే కలవరపెడుతున్నాయి. భారతి ఫుల్మాలి, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్ వంటి నలుగురు ఆటగాళ్లకు ఇదే మొదటి ప్రపంచకప్. మెగా టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడటం వీరికి సవాలే. మరోవైపు, వన్డే ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ వెన్నునొప్పితో దూరం కావడం కోలుకోలేని దెబ్బ. ఆమె స్థానాన్ని భర్తీ చేస్తుందనుకున్న కాశ్వి గౌతమ్ కూడా మోకాలి గాయంతో తప్పుకోవడంతో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, పేస్ బౌలింగ్ విభాగంలో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు పేస్ ఆల్‌రౌండర్‌గా అరుంధతి రెడ్డిపైనే విపరీతమైన ఒత్తిడి పడనుంది. 10 ఏళ్ల కలను సాధించేందుకు ఒత్తిడిని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఒక్కటి దాటి తొలిసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవాలని భారత్ కోరుకుంటోంది.

చరిత్ర పుటల్లో నిలిచే సువర్ణావకాశం..

భారత మహిళల క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నోసార్లు తృటిలో చేజారిన ఐసీసీ ట్రోఫీ కల ఎట్టకేలకు గత ఏడాది వన్డే ప్రపంచకప్ విజయంతో నెరవేరింది. ఇప్పుడు అదే ఊపుతో వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుని, బ్యాక్-టు-బ్యాక్ ట్రోఫీలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించే సువర్ణావకాశం హర్మన్‌ప్రీత్ సేన ముందుంది.

భారత తుది జట్టు (అంచనా): హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రేయాంక పాటిల్/రాధా యాదవ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..