AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: ఇలాంటి మంచి రోజులు వస్తాయని మీరెప్పుడైనా ఊహించారా? భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పతనం అవుతున్నాయి. ధరలు తగ్గుతుంటే మహిళలు ఎగిరిగంతులేస్తున్నారు. రికార్డు స్థాయిలో ధరలు దిగి వస్తుండటంతో ఇంకా తగ్గుతాయోమోనని ఆశల్లో ఉన్నారు. నిన్న తులంపై రూ.4,300 వరకు దిగి వచ్చింది..

Gold Price: ఇలాంటి మంచి రోజులు వస్తాయని మీరెప్పుడైనా ఊహించారా? భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
Gold Price Today
Subhash Goud
|

Updated on: Jun 11, 2026 | 6:26 AM

Share

Gold Price Today: ఇలాంటి రోజులు వస్తాయని మహిళలు ఎప్పుడైనా ఊహించారా? అస్సలు ఊహించి ఉండరు. ఎందుకంటే మహిళలకు బంగారంపై ఉండే మక్కువ అంతా ఇంతా కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు. ధరలు ఎంత పెరిగినా షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పతనం అవుతున్నాయి. ధరలు తగ్గుతుంటే మహిళలు ఎగిరిగంతులేస్తున్నారు. రికార్డు స్థాయిలో ధరలు దిగి వస్తుండటంతో ఇంకా తగ్గుతాయోమోనని ఆశల్లో ఉన్నారు.

తాజాగా నిన్న తులంపై రూ.4,300 వరకు దిగి వచ్చింది. ఇప్పుడు కూడా ధర తగ్గింది. జూన్‌ 11వ తేదీన దేశీయంగా తులం బంగారం ధర రూ.1,48,850 వద్ద కొనసాగుతుండగా, వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  1. హైదరాబాద్‌ – 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,440 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడ -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,440 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీ -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,900 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,590 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,440 వద్ద కొనసాగుతోంది.
  5. బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,440 వద్ద కొనసాగుతోంది.
  6. చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,990 వద్ద కొనసాగుతోంది.
  7. కోల్‌కతా- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,440 వద్ద కొనసాగుతోంది.
  8. కేరళ- 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,440 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు:

  • హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడ – 2,59,900
  • ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా – 2,49,900

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us