Home Loan: మీరు హోమ్‌ లోన్‌ తీసుకున్నారా..? సరైన సమయానికి వాయిదాలు చెల్లించకపోతే ఏమవుతుంది..?

Home Loan: ప్రస్తుతమున్న రోజుల్లో బ్యాంకుల నుంచి అత్యధికంగా గృహ రుణాలు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. కొత్త ఇంటి సాకారం చేసుకోవాలంటే తప్పకుండా గృహ రుణం..

Home Loan: మీరు హోమ్‌ లోన్‌ తీసుకున్నారా..? సరైన సమయానికి వాయిదాలు చెల్లించకపోతే ఏమవుతుంది..?
Home Loan
Follow us
Subhash Goud

|

Updated on: Oct 19, 2021 | 2:19 PM

Home Loan: ప్రస్తుతమున్న రోజుల్లో బ్యాంకుల నుంచి అత్యధికంగా గృహ రుణాలు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. కొత్త ఇంటి సాకారం చేసుకోవాలంటే తప్పకుండా గృహ రుణం తీసుకుంటారు. డబ్బు సంపాదనతో ఇల్లు కట్టడం, కొనడం అనేది సాధ్యం కాదు చాలా మందికి. అయితే గృహరుణం తీసుకున్నవారు ఉపాధి కోల్పోవడం, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల రుణ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలా వాయిదాలు.. వాటిపై వడ్డీ, రుసుములు పెరిగి ఓ పెద్ద గుదిబండగా మారతాయి. ఒక్కోసారి తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు బ్యాంకులు మన రుణాన్ని ఎలా వసూలు చేస్తాయి? మన ముందున్న మార్గాలు ఏమిటో చూద్దాం.

సాధారణంగా ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడి ఒక్కోసారి ఒకటి లేదా రెండు ఈఎంఐలు చెల్లించడంలో ఆలస్యమవుతుంది. ఇలాంటి సమయంలో బ్యాంకుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది. బ్యాంకులు చిన్న చిన్న హెచ్చరికలు జారీ చేసి వదిలేస్తాయి. కానీ, వరుసగా మూడు నెలల పాటు ఈఎంఐ చెల్లింపుల్లో జాప్యం జరిగిందంటే ప్రమాదం ముంచుకొస్తోందని భావించాలి. బ్యాంకులు వెంటనే అప్రమత్తమై మీ రుణాన్ని నిరర్ధక ఆస్తిగా గుర్తిస్తాయి. మీకు నోటీసులు జారీ చేస్తాయి. ఆ తర్వాత కూడా మీరు స్పందించకపోతే.. మిమ్మల్ని దివాలాదారుగా గుర్తించి ఇంటికి నోటీసులు పంపుతాయి. ఈ క్రమంలో మీ సిబిల్‌ స్కోర్‌ సైతం క్రమంగా దెబ్బతింటుంది.

ఇక మీరు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేరని బ్యాంకు భావించినట్లయితే తదుపరి చర్యలకు రెడీ అవుతుంది. సర్ఫేసీ చట్టం ప్రకారం 60 రోజుల గడువుతో తుది నోటీసు పంపుతుంది. మీరు రుణ వాయిదాలను చెల్లించడానికి ఇదే మీకు చివరి అవకాశంగా భావించాలి. ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే.. చట్ట ప్రకారం ఆ ఆస్తిని రుణమిచ్చిన సంస్థ స్వాధీనం చేసుకోవచ్చు. ఏ కోర్టు, చట్టపరమైన జోక్యం అవసరం లేకుండానే ఈ పనిచేయవచ్చు. అందుకే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి. లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, బ్యాంకు ఇచ్చిన చివరి 60 రోజుల గడువులో మీరు బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాతపూర్వకంగా మీ పరిస్థితిని వారికి తెలియజేసి వారిని ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు. జరిమానాతో మరికొంతకాలం నోటీసు పీరియడ్‌ను పొడిగించే అవకాశం కూడా ఉంఉటంది. కానీ, అందుకు వారు నిరాకరిస్తే మాత్రం చేసేదేమి ఉండదు. ఈ 60 రోజుల గడువు ముగుస్తున్న సమయంలో ఏదో ఒకరోజు రికవరీ ఏజెంట్లు మీ తలుపు తట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. మీ వద్దకు వచ్చే బ్యాంకు ఏజెంట్ల గుర్తింపును మీరు ధృవీకరించేందుకు ఆధారాలు అడిగే అవకాశం ఉంటుంది. వారు వారి గుర్తింపు కార్డులతో పాటు, బ్యాంకు నుంచి ఆథరైజేషన్‌ లెటర్‌ తీసుకొని రావాల్సి ఉంటుంది.

ఇల్లు వేలం వేయాల్సిన పరిస్థితి వస్తే..

రుణం చెల్లించని పక్షంలో రుణం ఇచ్చిన బ్యాంకులు గానీ, ఇతర సంస్థలు గానీ.. ఇంటి వాస్తవ విలువను అంచనా వేస్తాయి. తర్వాత వేలం ప్రక్రియను ప్రారంభిస్తాయి. వేలానికి సంబంధించిన వివరాలను దినపత్రికలో ప్రచురిస్తాయి. వేలంలో పేర్కొన్న విలువ తక్కువ అని యజమాని భావిస్తే సంస్థలను సంప్రదించవచ్చు. ఒకసారి ఇలా ఆస్తిని స్వాధీనం చేసుకున్న సంస్థలు దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ఆస్తిపై హక్కులను వేరే సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఇది వేలం ద్వారా జరుగుతుంది. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా, వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకుంటుంది. అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని రుణ చెల్లింపుల్లో విఫలమైన వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తుంది.

మీ ముందున్న ఓ మార్గం..

ఇక మీకు మరో మార్గం ఉంటుంది. మిమ్మల్ని దివాలాదారుగా గుర్తించిన వెంటనే మీ ఇంటిని మీరే విక్రయించేందుకు ప్రయత్నించండి. వచ్చే సొమ్ముతో రుణాన్ని చెల్లించే ప్రయత్నం చేయండి. బ్యాంకులు కేవలం వారి రుణాన్ని రికవరీ చేసుకోవడంపైనే దృష్టి పెడతాయి. కాబట్టి మీ ఇంటికి సరైన ధర రావాలన్న దానిపై వారికి ఏమాత్రం ఆసక్తి ఉండకపోవచ్చు. అందుకే అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే మీ ఇంటికి మీరే విక్రయిస్తే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది.

మరీ ఇలాంటి పరిస్థితి రావొద్దంటే..

మీ ఈఎంఐలు ప్రతినెలా మీ చేతికొచ్చే ఆదాయంలో 40 శాతానికి మించకుండా చూసుకోండి. ఇంతకంటే మించితే చిన్న ఆర్థిక సమస్య తలెత్తినా.. రుణాలు చెల్లించక తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే బాగుంటుంది. మీకు నెలవారీ ఈఎంఐ తక్కువ పడుతుంది. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడే వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చెల్లించేందుకు ప్రయత్నించండి. అప్పుడు రుణ మొత్తం తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా భారం కాదు. వీలైతే 40 శాతానికి పైగా డౌన్‌పేమెంట్‌ కింద చెల్లించండి.

ఇవీ కూడా చదవండి:

Bank Loan: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా..? ఈ రెండు స్కీమ్‌లో చేరితే సులభంగా రుణాలు..!

Bank Loan Offer: ఈ బ్యాంకులో రుణాలు పొందేవారికి అదిరిపోయే శుభవార్త.. రూ.లక్షకు 630 ఈఎంఐ సదుపాయం..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!