Reject Zomato: హిందీ వస్తేనే డబ్బులు రిఫండ్ అవుతాయి.. కస్టమర్‎కు షాకిచ్చిన జోమాటో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్..‎

ఆన్‎లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‎ఫామ్ జోమాటో ట్విట్టర్‎లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఓ వ్యక్తి జోమాటాలో ఫుడ్ అర్డర్ చేశాడు. కానీ అతనికి వచ్చిన ఫుడ్‎లో ఒక ఐటమ్ మిస్ అయింది. దీంతో అతను జోమాటో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‎ను సంప్రదించాడు. అయితే ఎగ్జిక్యూటివ్‎ హిందీ వస్తే డబ్బులు తిరిగి వస్తాయని చెప్పారు...

Reject Zomato: హిందీ వస్తేనే డబ్బులు రిఫండ్ అవుతాయి.. కస్టమర్‎కు షాకిచ్చిన జోమాటో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్..‎
Zomaot
Follow us

|

Updated on: Oct 19, 2021 | 1:51 PM

ఆన్‎లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‎ఫామ్ జోమాటో ట్విట్టర్‎లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఓ వ్యక్తి జోమాటాలో ఫుడ్ అర్డర్ చేశాడు. కానీ అతనికి వచ్చిన ఫుడ్‎లో ఒక ఐటమ్ మిస్ అయింది. దీంతో అతను జోమాటో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‎ను సంప్రదించాడు. అయితే ఎగ్జిక్యూటివ్‎ హిందీ వస్తే డబ్బులు తిరిగి వస్తాయని చెప్పారు. ఈ నిషయాన్ని వినియోదారుడు ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు. దీంతో జోమాటోపై ట్విట్టర్‎లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ‎కస్టమర్ పోస్ట్ వైరల్ అయిన తర్వాత ‘రిజెక్ట్ జోమాటో’ ట్విట్టర్‌లో ట్రెండింగ్‎లోకి వచ్చింది.

తమిళనాడుకు చెందిన వికాష్ జోమాటో ఫుడ్ అర్డర్ చేశాడు. తన ఆర్డర్‌లో ఒక వస్తువు మిస్ అయినట్లు గుర్తించిన తర్వాత అతను జోమాటో కస్టమర్ సర్వీస్‌ని సంప్రదించాడు. వికాష్ ప్రకారం, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ‘హిందీ తెలియదు’ కాబట్టి చెల్లింపును తిరిగి చెల్లించలేమని చెప్పాడు. చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా వికాష్ ట్విట్టర్‎లో పంచుకున్నాడు. “జోమాటో తమిళనాడులో అందుబాటులో ఉంటే, వారు భాషను అర్థం చేసుకున్న వ్యక్తులను నియమించుకోవాలి” అని వికాష్‌ చాట్ చేశాడు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ” సమాచారం కోసం, హిందీ మన జాతీయ భాష. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందీని కొద్దిగా తెలుసుకోవడం సర్వసాధారణం.” ఈ ప్రతిస్పందన వికాష్‌కి కోపం తెప్పించింది, “భారతీయుడిగా నేను హిందీ నేర్చుకోవాలి” అని ట్యాగ్ చేశారు.

ప్రతిస్పందనగా, జొమాటో ఈ సంఘటన ‘ఆమోదయోగ్యం కాదు’ అని చెప్పింది. సమస్యను పరిష్కరించడానికి వికాష్ యొక్క వివరాలను కోరింది. వికాష్ దీనిపై సతృప్తిగా లేడుఅతను పేర్కొన్న ఎగ్జిక్యూటివ్ నుండి ‘బహిరంగ క్షమాపణ’ కోరాడు.

Read Also.. Petrol Diesel Price: దేశవ్యాప్తంగా జోరు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎంత ఉందో తెలుసా..