Audi Q5: అమ్మకాలు షురూ…రూ.2లక్షలతో ముందుగానే బుక్ చేసుకోవచ్చు!
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ 'ఆడీ' తన కొత్త 'క్యూ 5 ఎస్‌యూవీ' కార్ల అమ్మకాలను షురూ చేసింది..

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ‘ఆడీ’ తన కొత్త ‘క్యూ 5 ఎస్‌యూవీ’ కార్ల అమ్మకాలను షురూ చేసింది. ఇండియాలో వచ్చే నెలలో విడుదల కానున్న ఈ కారు కోసం మంగళవారం నుంచి బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్ కేంద్రాల్లో రూ.2లక్షలు చెల్లించి ముందుగానే ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
మొత్తం 8 ఎయిర్ బ్యాగ్‌లు!
2021గానూ ఆడీ సంస్థ ఇప్పటివరకు 8 సరికొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. రాబోయే నెలలో మార్కెట్లోకి రానున్న ‘క్యూ 5 ఎస్‌యూవీ’ తొమ్మిదోది. రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఈ కారు 370 ఎన్ ఎం టార్క్ వద్ద 249 హెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. ముందు, వెనక భాగాల్లో రెండు ఎయిర్ బ్యాగులతో సహా మొత్తం 8 ఎయిర్ బ్యాగులను అమర్చారు. అదేవిధంగా ఆడీ పార్కింగ్ అసిస్ట్, సెన్సార్ కంఫర్ట్ కీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నాయి. వాహనాలు బీఎస్-6 మారడంతో గత ఏడాది క్యూ 3, క్యూ 7 తో పాటు పాత క్యూ 5 కార్ల విక్రయాలన్నింటినీ ఆడీ నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది తొలి 8 నెలల విక్రయాల్లో మాత్రం 115 శాతం వృద్ధి రేటు సాధించింది. తాజాగా తన క్యూ 5 ఎస్‌యూవీ విక్రయాల ద్వారా భారత్‌లో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది.
Read Also: Petrol Diesel Price: దేశవ్యాప్తంగా జోరు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎంత ఉందో తెలుసా..
Post Office: ఈ 4 పోస్టాఫీసు పథకాలలో అధిక రాబడి..! అదనంగా పన్ను మినహాయింపు