Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nokia XR20: కింద పడినా పగలని.. నీటిలో తడిచినా పాడవని స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసిన నోకియా.. ధర ఎంత అంటే

Nokia XR20: ఒకప్పుడు సెల్ ఫోన్ రంగంలో రాజులా వెలిసిన నోకియా.. సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి అడుగు పెట్టింది. వినియోగదారులను ఆకట్టుకుని.. మళ్ళీ సత్తాచాటాలని..

Nokia XR20:  కింద పడినా పగలని.. నీటిలో తడిచినా పాడవని స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసిన నోకియా.. ధర ఎంత అంటే
Nokia Xr20
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2021 | 10:08 AM

Nokia XR20: ఒకప్పుడు సెల్ ఫోన్ రంగంలో రాజులా వెలిసిన నోకియా.. సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి అడుగు పెట్టింది. వినియోగదారులను ఆకట్టుకుని.. మళ్ళీ సత్తాచాటాలని భావిస్తోంది. తాజాగా నోకియా తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మిలిటరీ గ్రేడ్ ఫీచర్స్, IP68 రేటింగ్ సర్టిఫికేషన్ తో మార్కెట్లో అడుగు పెట్టింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ .. కిందపడినా పగలదు.. వర్షంలో తడిచినా.. నీటిలో పడినా పాడుకాదు. నోకియా ఎక్స్ ఆర్ 20 పేరుతో భారత్ లో రిలీజ్ చేసిన ఈ 5G స్మార్ట్ ఫోన్ ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా తట్టుకుని పనిచేస్తుంది. దీని నిర్మాణం ఆల్-రౌండ్ ప్రొటక్షన్ ఇస్తుంది. ఇది 1.8 మీటర్ల ఎత్తునుండి కింద పడినా స్మార్ట్ ఫోన్ కు ఏమీ కాదు.

నోకియా ఎక్స్‌ఆర్20 ఫోన్ డిస్ప్లే మరింత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ 6. 67 ఇంచ్ FHD+ (2400×1080) రిజల్యూషన్ డిస్ప్లే ని కలిగి ఉంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ కటౌట్ నోచ్ డిజన్ తో రూపొందించారు. ఈ స్క్రీన్ పగలకుండా సురక్షితంగా ఉండడం కోసం గొరిల్లా గ్లాస్ విక్టుస్‌ అందించింది. ఈ నోకియా ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 5G ప్రోసెసర్తో నడుస్తుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రిలీజైన 48MP మైన్ కెమెరాతో పాటు 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంది. దీని ధర రూ.46,999. ఈ ఫోన్ అల్ట్రా బ్లూ మరియు గ్రానైట్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది. Nokia XR20 అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్, e-కామ్ ప్లాట్ఫారమ్స్ , నోకియా అధికారిక వెబ్సైట్ nokia.com ల్లో లభ్యమవుతుంది.

Also Read:  అందమైన ఇంద్ర ధనుస్సు రంగులున్న కొండచిలువ.. మైలవ్.. పేరుతో పెంచుకుంటున్న వైనం..

అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే
మీ కిడ్నీల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.. ఇవి తినడం మర్చిపోకండి
మీ కిడ్నీల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.. ఇవి తినడం మర్చిపోకండి
ఈ 10 విషయాలు తెలిస్తే కష్టం మీ కాంపౌండ్ వాల్ దాటదు!
ఈ 10 విషయాలు తెలిస్తే కష్టం మీ కాంపౌండ్ వాల్ దాటదు!