Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. 400 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా లాభపడింది. గత మూడు సెషన్లలో నష్టాలు మూటగట్టుకున్న సూచీలు.. శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపాయి.
కొద్దిసేపటి క్రితం సెన్సెక్స్ 383 పాయింట్ల లాభంతో 61,307 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 18,276 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్ కంపెనీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌కార్ప్ షేర్లు లాభాలు ఆర్జించాయి.
కాగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.83 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read..
Viral News: ఏడాది చిన్నారి నెలకు రూ.75 వేలు సంపాదిస్తున్నాడు… ఎలాగంటే…
Indian Railways: అందుబాటులోకి రానున్న మరిన్ని ఎకానమీ AC-3 టైర్ రైళ్లు.. ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే..