Viral News: ఏడాది చిన్నారి నెలకు రూ.75 వేలు సంపాదిస్తున్నాడు… ఎలాగంటే…

సాధారణంగా ఏడాది వయసున్న పిల్లలు ఎక్కువగా అమ్మనాన్నలతోనే గడుపుతుంటారు. బుడిబుడి అడుగులేస్తూ...

Viral News: ఏడాది చిన్నారి నెలకు రూ.75 వేలు సంపాదిస్తున్నాడు... ఎలాగంటే...
Briggs
Follow us
Basha Shek

|

Updated on: Oct 22, 2021 | 10:01 AM

సాధారణంగా ఏడాది వయసున్న పిల్లలు ఎక్కువగా అమ్మనాన్నలతోనే గడుపుతుంటారు. బుడిబుడి అడుగులేస్తూ ఇంట్లోనే సందడి చేస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన బ్రిగ్స్‌ అనే చిన్నారి మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి యూఎస్‌ అంతా తిరుగుతున్నాడు. నెలకు వెయ్యి డాలర్లు(ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ.75000) ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు 45 విమానాలు ఎక్కి ఏకంగా 16 రాష్ట్రాలను చుట్టి వచ్చాడీ బుడ్డోడు. అలస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా తదితర నగరాల్లోని అందమైన పార్కులు, బీచ్‌ల్లో తిరిగేశాడు. మరి తన పర్యటనలతో ఈ చిన్నారి ఇన్ని పైసలెలా సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం రండి.

మూడు వారాల వయసులోనే మొదలెట్టేశాడు! బ్రిగ్స్‌ తల్లి జెస్‌ గత కొన్నేళ్లుగా ‘పార్ట్‌ టైమ్‌ టూరిస్ట్స్‌ ‘ అనే బ్లాగ్‌ నడుపుతోంది. ఇందులో భాగంగా చిన్నారితో వివిధ ప్రాంతాలను చుట్టి…ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం జెస్‌ పని. దీనికి డబ్బులు కూడా చెల్లిస్తారు. ఇలా సగటున నెలకు రూ.75వేలపైనే ఆదాయం ఆర్జిస్తోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రిగ్స్‌కు 31వేల మంది ఫాలోవర్లు ఉండడం విశేషం. తన ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘నేను 2020లో గర్భం దాల్చినప్పుడు ఇక నా కెరీర్‌ ముగిసినట్లే అనుకున్నాను. అయితే అదే ఏడాది అక్టోబర్‌ 14న బ్రిగ్స్‌ జన్మించాక నాకో ఆలోచన వచ్చింది. బేబితో ప్రయాణించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. మొదటి సారి ప్రయాణం చేసినప్పుడు నా బేబీ వయసు కేవలం 3 వారాలు మాత్రమే. నా భర్త స్టీవ్‌ సహకారంతో అమెరికాలోని పలు రాష్ట్రాలను చుట్టేశాం. కరోనా నిబంధనలు, ప్రొటోకాల్స్‌ పాటిస్తూనే ఈ ప్రయాణాలు చేశాం. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌లో మాత్రం అడుగుపెట్టలేదు. త్వరలోనే యూరప్‌ పర్యటనకు బయలుదేరనున్నాం’ అని అంటోంది జెస్‌.

Also read :

Old Woman World Record Video: బలశాలి బామ్మ.. వరల్డ్‌ రికార్డ్‌.. సెంచరీ వయసులో సవాళ్లకు సై అంటున్న బామ్మ.. (వీడియో)

Rush driving Video: ఊరేగింపులో దారుణం.. భక్తులపైకి దూసుకొచ్చిన కారు.. వైరల్ అవుతున్న వీడియో..