PM Narendra Modi Speech: ఈ ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దేశం 100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించే మార్కును దాటి గురువారం రికార్డు సృష్టించింది. అటువంటి పరిస్థితిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రధాని మోడీ ప్రసంగంలో కోవిడ్ టీకాకు సంబంధించి దేశం అవిశ్రాంతంగా చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడవచ్చు. దీనితో పాటు కోవిడ్‌కు సంబంధించిన సవాళ్ల గురించి దేశప్రజలను కూడా ప్రధాని ప్రస్తావించవచ్చు. ప్రధాని మోడీ ఈరోజు 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
PM @narendramodi will address the nation at 10 AM today.
— PMO India (@PMOIndia) October 22, 2021
మహా యజ్ఞంలా సాగిన వ్యాక్సిన్ కార్యక్రమం.. భారత్ ను సగర్వంగా నిలిపేలా చేసింది. 100 కోట్ల డోసులు ఇచ్చిన రెండవ దేశంగా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా దేశంలోని 100 చారిత్రక కట్టడాలపై త్రివర్ణ రంగులు రెపరెపలాడాయి. జనవరి 16 న దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించగా.. ఫిబ్రవరి 19 నాటికి కోటి వ్యాక్సిన్ డోసుల మార్కును దాటింది. ఏప్రిల్ 11 నాటికి 10 కోట్ల వ్యాక్సిన్ డోసుల మార్కును అందుకుంది. జూన్ 12 నాటికి 25 కోట్ల డోసులు ఇవ్వగా, ఆగస్టు 6 కల్లా అది 50 కోట్ల డోసులకు చేరింది. ఆతర్వాత సెప్టెంబర్ 13 నాటికి 75 కోట్ల డోసులు.. నిన్నటితో వంద కోట్ల డోసులు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 30 శాతం మందికి రెండు డోసులు పూర్తయినట్టు లెక్కలు చెప్తున్నాయి.
ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17న ఏకంగా రెండున్నర కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. ఆగస్ట్ 6నాటికి 50 కోట్ల డోసుల పంపిణీ పూర్తవగా.. ఇవాళ వంద కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇక ఇప్పటివరకు 31 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది.
100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌ల మైలు రాయిని అందుకున్నందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను అభినందించింది. తక్కువ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్‌లను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమన్నారు WHO చీఫ్ టెడ్రోస్, సౌత్ ఏసియా రీజనర్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్.
ఇవి కూడా చదవండి: Corona Vaccine: ఫైజర్ బూస్టర్ డోస్ తో కరోనా నుంచి పూర్తి రక్షణ.. పలు దేశాల్లో ప్రారంభం అయిన బూస్టర్ వ్యాక్సినేషన్!