Corona Vaccine: ఫైజర్ బూస్టర్ డోస్ తో కరోనా నుంచి పూర్తి రక్షణ.. పలు దేశాల్లో ప్రారంభం అయిన బూస్టర్ వ్యాక్సినేషన్!

ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ షాట్ 95.6% సంక్రమణకు రక్షణ కల్పిస్తుందని కంపెనీ చెబుతోంది. డెల్టా వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ట్రయల్స్ నిర్వహించినట్టు ఫైజర్-బయోటెక్ తెలిపింది.

Corona Vaccine: ఫైజర్ బూస్టర్ డోస్ తో కరోనా నుంచి పూర్తి రక్షణ.. పలు దేశాల్లో ప్రారంభం అయిన బూస్టర్ వ్యాక్సినేషన్!
Pfizer Biotech Corona Vaccine Booster Dose
Follow us

|

Updated on: Oct 22, 2021 | 7:25 AM

Corona Vaccine: ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ షాట్ 95.6% సంక్రమణకు రక్షణ కల్పిస్తుందని కంపెనీ చెబుతోంది. 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 10,000 మంది వ్యక్తులపై 11 నెలల పాటు నిర్వహించిన ట్రయల్ గురించి సమాచారాన్ని కంపెనీ విడుదల చేసింది. ఫైజర్ టీకా రెండవ మోతాదు 84%, మూడవ (బూస్టర్) మోతాదు తీసుకున్న తర్వాత, సంక్రమణను 95.6% వరకు నివారించవచ్చని ఈ ట్రయల్స్ లో స్పష్టం అయిందని ఆ సమాచారంలో కంపెనీ పేర్కొంది.

డెల్టా వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ట్రయల్స్ నిర్వహించినట్టు ఫైజర్-బయోటెక్ తెలిపింది. కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బోయెర్లా మాట్లాడుతూ, బూస్టర్ షాట్ పొందడం వల్ల ఇన్ఫెక్షన్ నుండి బాగా రక్షించవచ్చని ట్రయల్ ఫలితాలు చూపుతున్నాయని చెప్పారు.

అనేక దేశాలు ఇప్పటికే బూస్టర్ మోతాదులను ఇవ్వడం ప్రారంభించాయి. కాగా, ఈ ట్రయల్ ప్రారంభ డేటాను త్వరలో రెగ్యులేటరీ ఏజెన్సీతో పంచుకుంటామని కంపెనీ తెలిపింది. అనేక దేశాలు తమ పౌరుల రోగనిరోధక శక్తిని పెంచడానికి కరోనా టీకా బూస్టర్ షాట్‌లను ఉపయోగించడం ఇప్పటికే ప్రారంభించాయి. ఈ ట్రయల్స్ లో పాల్గొన్న వ్యక్తుల సాధారణ వయస్సును 53 సంవత్సరాలుగా చెబుతున్నారు. ఇందులో 55.5% 16 నుండి 55 సంవత్సరాల వయస్సు గలవారు కాగా, 23.3% 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

యుఎస్‌లో బూస్టర్ మోతాదుల కోసం నియమాలు ఏమిటి?

యుఎస్ ఫెడరల్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) సెప్టెంబర్‌లో టీకా బూస్టర్ మోతాదును ప్రవేశపెట్టడానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు మాత్రమే బూస్టర్ డోస్‌లు ఇస్తున్నారు.

యూరోప్‌లో 18+ కి బూస్టర్ డోస్‌లు

యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) అక్టోబర్ నాటికి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌లను అనుమతించింది. ఇజ్రాయిల్ అతి తక్కువ వయస్సు పరిమితిని కలిగి ఉంది. ఇజ్రాయెల్ 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రజలందరికీ బూస్టర్ డోస్ ఇవ్వమని తన వైద్య అధికారులను కోరింది.

ఇవి కూడా చదవండి: AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం

Cyber Security: సైబర్ సెక్యూరిటీ ఛాలెంజింగ్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణలో యావత్ దేశానికే పయినీర్‌లా ఉండే పాలసీ

Pakistan: మళ్ళీ గ్రే లిస్టులో పాకిస్తాన్‌.. టెర్రరిజానికి కొమ్ము కాస్తున్నందుకు రెట్టింపైన పాక్ కష్టాలు!