Cyber Security: సైబర్ సెక్యూరిటీ ఛాలెంజింగ్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణలో యావత్ దేశానికే పయినీర్‌లా ఉండే పాలసీ

ఆన్ లైన్ నేరాలు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ అనేది యావత్ ప్రపంచానికే ఛాలెంజింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత దేశానికి పాయినీర్‌లా ఉండే పాలసీ

Cyber Security: సైబర్ సెక్యూరిటీ ఛాలెంజింగ్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణలో యావత్ దేశానికే పయినీర్‌లా ఉండే పాలసీ
Cyber Crime
Follow us

|

Updated on: Oct 22, 2021 | 6:43 AM

Telangana Cyber Security: ఆన్ లైన్ నేరాలు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ అనేది యావత్ ప్రపంచానికే ఛాలెంజింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత దేశానికి పయినీర్‌లా ఉండే పాలసీ తయారుచేస్తున్నామంటున్నారు మంత్రి కేటీఆర్. విదేశీ పెట్టుబడిదారులకు తెలంగాణలో పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. క్రైం అనేది అనేక రూపాంతరాలుగా మారి.. ఇప్పుడు సైబర్ రూపంలో సవాలుగా మారిందన్నారాయన. దీన్ని ఎదుర్కొనేందుకు డ్రాఫ్ట్ రూపొందిస్తున్నామన్న కేటీఆర్.. ఇందుకోసం నిపుణుల నుంచి సలహాలు స్వీకరిస్తున్నామన్నారు.

తెలంగాణ రూపొందించే పాలసీ దేశానికి పాయినీర్ కాబోతుందని స్పష్టం చేశారు. ఆధునిక యుగంలో మనం ఎంతో దూసుకుపోతున్నా.. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలకు సైబర్ భద్రత ఈ రోజుల్లో సవాల్‌గా మారిందన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇవాంటి హైదరాబాద్‌లో మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఇవాంటి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి.. విదేశీ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు.

రాబోయే రెండేళ్లలో ఆవిష్కరణ కేంద్రంతో పాటు, ఉద్యోగుల సంఖ్యను 2 వేలకు పెంచనున్నట్లు ఇవాంటి చేసిన ప్రకటనను కేటీఆర్ స్వాగతించారు. సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడంలో భాగంగా ఇవాంటి నిర్వహించే హ్యాకథాన్‌లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని కేటీఆర్ ప్రకటించారు. విదేశీ పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్న మంత్రి.. కంపెనీలకు అవసరమైన సహకారం అందిస్తామని ప్రకటించారు.

Read also: IAF Aircraft Crash: కూలి భూమిలోకి కూరుకుపోయిన మిరాజ్‌ 2000 యుద్ద విమానం.. పైలెట్‌ సాహసానికి మెచ్చుకుని తీరాల్సిందే..