Huzurabad By-Election: బహిరంగ సభ కాదు.. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ రోడ్‌షో.. భారీ ఏర్పాట్లు చేస్తున్న గులాబీ శ్రేణులు

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం.. నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. అన్ని రాజకీయ పార్టీలు.. తమదైన స్టైల్‌లో ప్రచారం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ మాత్రం.. సీఎంతో రోడ్‌షో నిర్వహించి.. క్లైమాక్స్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తోంది.

Huzurabad By-Election: బహిరంగ సభ కాదు.. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ రోడ్‌షో.. భారీ ఏర్పాట్లు చేస్తున్న గులాబీ శ్రేణులు
Cm Kcr
Follow us

|

Updated on: Oct 22, 2021 | 6:56 AM

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం.. నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. అన్ని రాజకీయ పార్టీలు.. తమదైన స్టైల్‌లో ప్రచారం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ మాత్రం.. సీఎంతో రోడ్‌షో నిర్వహించి.. క్లైమాక్స్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తోంది. తెలంగాణ పాలిటిక్స్.. ప్రస్తతం హుజూరాబాద్ చుట్టూరా తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తన్నాయి. అధికార టీఆర్ఎస్.. ఇంకాస్త దూకుడు పెంచింది. సీఎంతో సభ నిర్వహించి.. క్లైమాక్స్ అదిరిపోయేలా ప్లాన్ చేస్తోంది. కానీ సభపై ఆంక్షలున్నందున మరో భారీ ప్లాన్‌తో దూసుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాయి టీఆర్‌ఎస్ శ్రేణులు. అయితే ఈ నెల 27తో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే నెలలుగా హుజురాబాద్‌లో‌నే మకాం వేసిన టీఆర్‌ఎస్.. మరోసారి హుజూరాబాద్‌లో పార్టీ జెండా ఎగరేసేందుకు పావులు ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి హరీష్ రావు సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మండలాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ నెల 30న పోలింగ్‌ జరగనుండగా సీఎం కేసీఆర్‌ 26 లేదా 27న సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదని స్పష్టం చేసింది.

హుజూరాబాద్‌ ప్రచారంలో ఉన్న మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సభపై ఆంక్షలున్నందున దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నికల నిబంధనలను అనుసరించి నియోజకవర్గంలోనే రోడ్‌షోలు నిర్వహించాలనే అంశం చర్చకు వచ్చింది.

అయితే ఇందుకు అనుగూనంగా ఈ నెల 26, 27 తేదీల్లో రెండురోజుల పాటు నిర్వహించాలని మంత్రులు కోరగా… సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రోడ్‌షోలకు సంబంధించిన షెడ్యూలును రూపొందించి పంపాలని కేసీఆర్‌ స్థానిక మంత్రులు, నేతలకు సూచించారు.

హుజూరాబాద్‌లో ఎలక్షన్ కోడ్ ఇబ్బందిగా ఉండటంతో.. నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న పెంచికల్ పేటలో సీఎం కేసీఆర్‌తో భారీ సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ని పెంచికల్ లో.. 28 ఎకరాల్లో లక్ష మంది కెపాసిటీతో సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలా కాకుండా.. మరోమారు టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నిక అవుతున్న సందర్భంగా.. ముఖ్యమంత్రికి ధన్యవాద సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి పార్టీ శ్రేణులు.

ముఖ్యమంత్రి సభతో తమకు మరింత మైలేజ్ వస్తుంది అన్నది టిఆర్ ఎస్ నాయకుల అంచనా. అయితే ఈ రోడ్ షోలో  సీఎం ఏం మాట్లాడుతారనేది ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి: Viral Video: కోతుల గుంపు మధ్యలో యువకుడి నృత్యం.. అది చూసిన కోతులు ఏం చేశాయంటే.. ఫన్నీ వీడియో మీకోసం..

JNUEE Result 2021: త్వరలో జేఎన్‌యూ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్.. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..