Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోతుల గుంపు మధ్యలో యువకుడి నృత్యం.. అది చూసిన కోతులు ఏం చేశాయంటే.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. నెటిజన్లు నిత్యం రకరకాల వీడియోలను షేర్ చేస్తూనే ఉంటారు. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి.

Viral Video: కోతుల గుంపు మధ్యలో యువకుడి నృత్యం.. అది చూసిన కోతులు ఏం చేశాయంటే.. ఫన్నీ వీడియో మీకోసం..
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 22, 2021 | 5:48 AM

Viral Video: సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవే లేదు. నెటిజన్లు నిత్యం రకరకాల వీడియోలను షేర్ చేస్తూనే ఉంటారు. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి. కొన్ని వీడియోలు అయితే ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. చూస్తున్నా కొద్ది చూడాలనిపిస్తుంటుంది. అలాంటి ఫన్నీ వీడియోలను చూడటం ద్వారా కాస్త రిలాక్స్ అవ్వొచ్చు. తాజాగా అలాంటి ఫన్నీ వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను చూస్తే నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కోతుల గుంపు మధ్యలో నిల్చుంటాడు. ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడు. అదే ఇందులో ఫన్నీ మూమెంట్.

చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రకరకాల ఫీట్లు, స్కిట్లు చేస్తుంటారు. ఫన్నీ వీడియోలు, డైలాగ్స్, ఫైటింగ్స్ ఇలా అన్ని విధాలుగా ట్రై చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో వదులుతుంటారు. తాజాగా ఓ యువకుడు కూడా అదే ప్రయత్నం చేసి.. ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలోకి వదిలాడు. ఈ వీడియోలో యువకుడు కొండముచ్చుల గుంపు(లంగూర్) మధ్య నిల్చుంటాడు. ఆపై సరదాగా డ్యాన్స్ చేస్తాడు. అతను డ్యాన్స్ చేస్తుండగా.. ఆ కొండముచ్చులు తొలుత బాగానే చూశాయి. కానీ అతను స్టెప్పులు మారుస్తున్నప్పుడు అవి భయంతో జడుసుకున్నాయి. అతని వద్ద నుంచి దూరంగా పరుగులు తీశాయి. వాస్తవానికి కోతుల కంటే కూడా కొండముచ్చులు ప్రమాదకరం. కానీ, కొండముచ్చుల మధ్య నిల్చుని డ్యాన్స్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి. అతను భయపడకపోగా.. రివర్స్‌గా వాటినే భయపెట్టి.. నెటిజన్లు నవ్వులు పూయించాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో ‘‘animals_lover_wasim__77’’ అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో అతని డ్యాన్స్, కొండముచ్చుల రియాక్షన్ చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్ రాగా, అంతేస్థాయిలో లైక్స్ కూడా రావడం విశేషం.

Viral Video:

Also read:

Deficiency of Vitamin C: మీరు విటమిన్ ‘సి’ లోపంతో బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యాధులు రావచ్చు..

JNUEE Result 2021: త్వరలో జేఎన్‌యూ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్.. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

Turmeric Water Benefits: పసుపు నీరు రోజూ తాగుతున్నారా?.. అయితే ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు..!