Deficiency of Vitamin C: మీరు విటమిన్ ‘సి’ లోపంతో బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యాధులు రావచ్చు..

Deficiency of Vitamin C: మనిషి ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులతో పోరటానికి సి విటమిన్ చాలా ముఖ్యంగా. సి విటమన్ శరీరంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది.

Deficiency of Vitamin C: మీరు విటమిన్ ‘సి’ లోపంతో బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యాధులు రావచ్చు..
Vitamin C
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 22, 2021 | 5:45 AM

Deficiency of Vitamin C: మనిషి ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులతో పోరటానికి సి విటమిన్ చాలా ముఖ్యంగా. సి విటమన్ శరీరంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఎముకల అభివృద్ధి, రక్తనాళాల ఆరోగ్యం, గాయాలు త్వరగా నయం అవడంలో సి విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి లోపం అనేక వ్యాధులకు దారితీస్తుంది. ఫలితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మరి విటమిన్ సి లోపం వల్లే వ్యాధులు, సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధులు.. స్కర్వి.. స్కర్వి అనేది విటమిన్ సి లోపంతో సంబంధం ఉన్న అత్యంత ముఖ్యమైన వ్యాధి. దీనికి ప్రధాన కారణం విటమిన్ సి లేకపోవడం. ఇది గాయాలవడం, చిగుళ్ల నుండి రక్తస్రావం, బలహీనత, అలసట, దద్దుర్లు మొదలైన వాటికి కారణమవుతుంది. ప్రారంభంలో విటమిన్ సి లోపం కారణంగా అలసట, ఆకలి లేకపోవడం, చిరాకు, కీళ్ల నొప్పి మొదలైన సమస్యలు వస్తాయి. అయితే, సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. లేదంటే.. రక్తహీనత, చిగురువాపు, చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

హైపర్ థైరాయిడిజం.. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్లను స్రవించినప్పుడు హైపర్ థైరాయిడిజం వస్తుంది. థైరాయిడ్ గ్రంథులు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలు కీలకమైనవి. దీర్ఘకాలిక విటమిన్ సి లోపం వలన థైరాయిడ్ గ్రంథుల నుండి హార్మోన్లు అధికంగా స్రవించడం, హైపర్ థైరాయిడిజానికి కారణమవుతాయి. అనుకోకుండా బరువు తగ్గడం, ఆకలి పెరగడం, భయపడటం, వణుకు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు ఇలా అనేక సమస్యలు ఏర్పడుతాయి.

రక్తహీనత.. ఆహారంలో విటమిన్ సి ఉండటం చాలా ముఖ్యం. ఇతర ప్రయోజనాలతోపాటు, విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. ఇది రక్తహీనత వంటి వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం కారణంగా.. అలసట, పాలిపోయినట్లు ఉండటం, శ్వాస ఆడకపోవడం, మైకం, బరువు తగ్గడం మొదలైన లక్షణాలను ఎదుర్కోవలసి వస్తుంది.

చిగుళ్ళ నుండి రక్తస్రావం.. దంతాల ఆరోగ్యానికి విటమిన్ సి చాలా ముఖ్యం. ఇది దంతాలను బలోపేతం చేయడమే కాకుండా చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం రావడం, ఇతర చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది.

చర్మ సంబంధిత వ్యాధులు.. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కూడా విటమిన్ సి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రోటీన్ చర్మం, జుట్టు, కీళ్ళు, చర్మానికి ముఖ్యమైనది. సి విటమిన్ లోపం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశం ఉంది.

విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి ఈ ఆహారాలను తినాలి.. మీరు తినే ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. సిట్రస్ పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ధూమపానం మానేయాలి. ఎందుకంటే పలు అధ్యయనాల ప్రకారం.. ధూమపానం చేసేవారి శరీరంలో విటమిన్ సి పరిమాణం గణనీయంగా తగ్గినట్లు తేలింది.

Also read:

JNUEE Result 2021: త్వరలో జేఎన్‌యూ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్.. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

Turmeric Water Benefits: పసుపు నీరు రోజూ తాగుతున్నారా?.. అయితే ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు..!

TDP vs YCP: పట్టాభిని అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొన్న పోలీసులు..

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!