Turmeric Water Benefits: పసుపు నీరు రోజూ తాగుతున్నారా?.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు..!

Turmeric Water Benefits: పసుపు వంటింట్లో లభించే ఔషధ గని. ఇందులోనే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Turmeric Water Benefits: పసుపు నీరు రోజూ తాగుతున్నారా?.. ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు..!
Turmeric Water
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 22, 2021 | 5:51 AM

Turmeric Water Benefits: పసుపు వంటింట్లో లభించే ఔషధ గని. ఇందులోనే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీరోజూ తినే ఆహారంలో పసుపు తప్పనిసరిగా వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఇప్పుడే కాదు.. తరతరాల నుంచి వంటింట్లో పసుపు లేకుండా ఏ వంటకం కూడా అవదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, పసుపు ఆహారంలో కలిపి తీసుకోవడమే కాకుండా నేరుగా నీటిలోనూ కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా శరీరంలోని హానీకరమైన టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడుతుందన్నారు. శరీరంలోని మలినాలను శుభ్రపరచడానికి పసుపు నీరు ఒక సులభమైన మార్గంగా పేర్కొంటున్నారు.

పసుపు నీరు ఎలా తీసుకోవాలి.. ఒక పాన్‌లో నీళ్లు పోసి మరిగించాలి. ఒక కప్పులో చిటికెడు పసుపు వేసి నిమ్మరసం కలపాలి. ఆ నీటిని కప్పులోకి తీసుకుని రుచి కోసం తేనెను కూడా కలుపుకోవచ్చు. క్రమం తప్పకుండా ఈ పసుపు నీటిని తాగడం వల్ల మీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. మీ చర్మాన్ని సహజంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఆర్థరైటిస్ సమస్యల నుంచి ఉపశమనం.. కీళ్ల నొప్పులు ప్రతి ఒక్కరికి సాధారణంగా మారిపోయాయి. అయితే, పసుపు పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పులను నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే వ్యాధి నిరోధక లక్షణాలు కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచడానికి.. పసుపులో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే కర్కుమిన్ ఉంటుంది. ఇది అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవి మీ శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పసుపు పాలను రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు.

బరువు తగ్గడానికి.. బరువు తగ్గాలనుకుంటే, మీ జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో పసుపును చేర్చడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన శరీరం.. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సెల్ డ్యామేజ్‌తో పోరాడతాయి. అవి మిమ్మల్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి. పసుపును ఏ రూపంలోనైనా తీసుకోవడం వల్ల శరీరంలో కణాల నష్టం జరగదు.

చర్మాన్ని మెరుగుపరుస్తుంది.. పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి మీ చర్మానికి చాలా మంచిది. పసుపు నీరు త్రాగడం వలన మీ చర్మానికి నష్టం జరగకుండా, వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తుంది. పసుపు మీ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Also read:

TDP vs YCP: పట్టాభిని అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొన్న పోలీసులు..

Telangana: ఛీ.. వీడసలు మనిషేనా?.. తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలను ఆదుకుంటానని చెప్పి..

Telangana Crime: ప్రేమ పేరుతో వేధింపులు.. అది తెలిసి యువతి బంధువులు ఏం చేశారంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!