Biscuits Side Effects: బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా.? అయితే ఈ షాకింగ్ విషయాలు మీకోసమే..

పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా బిస్కెట్లను ఇష్టపడుతుంటారు. ఇక ఉద్యోగస్తులైతే.. బ్రేక్ సమయంలో టీలో ముంచుకుని..

Biscuits Side Effects: బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా.? అయితే ఈ షాకింగ్ విషయాలు మీకోసమే..
Biscuits
Follow us

|

Updated on: Oct 21, 2021 | 3:59 PM

పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా బిస్కెట్లను ఇష్టపడుతుంటారు. ఇక ఉద్యోగస్తులైతే.. బ్రేక్ సమయంలో టీలో ముంచుకుని బిస్కెట్లు తింటూ.. వాటి రుచిని ఆస్వాదిస్తారు. ఇలా ప్రతీ రోజూ ఎవరొకరు బిస్కెట్ల రుచిని టేస్ట్ చేస్తూనే ఉంటారు. అయితే ఎక్కువ బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి హానికరం అని హాంగ్‌కాంగ్ పరిశోధకులు అంటున్నారు. 60 వేర్వేరు రకాల బిస్కెట్లపై వారు చేసిన తాజాగా అధ్యయనం పలు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.!

హాంగ్‌కాంగ్‌కు చెందిన పలువురు పరిశోధకులు తాజాగా 60 వేర్వేరు రకాల బిస్కెట్లపై ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్యాక్ చేసిన బిస్కెట్లలో గ్లైసిడోల్, యాక్రిలమైడ్ అనే రెండు రసాయనాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో పలు బిస్కెట్ ఫ్యాక్టరీలు వాటి మోతాదును ఎక్కువగా వినియోగిస్తుండటంతో క్యాన్సర్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. బిస్కెట్ తయారీదారులు గ్లైసిడోల్, అక్రిలామైడ్‌‌లను బిస్కెట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. అయితే వాటికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ బెంచ్‌మార్క్ ప్రకారం ఒక కిలో బిస్కెట్ల కోసం యాక్రిలమైడ్‌ను 350 గ్రాముల పరిమితిలో వినియోగించాలి. ఇదే సేఫ్ లిమిట్ అని అంటారు. అయితే, రెగ్యులేటర్లు కనీసం నాలుగు బిస్కెట్ బ్రాండ్లు ఈ పరిమితిని మించినట్లుగా కనుగొన్నారు. శాండ్‌విచ్ క్రాకర్‌(Muji)లో 620 గ్రాముల అక్రిలామైడ్ ఉన్నట్లు తేలింది. అలాగే కార్సినోజెనిక్(క్యాన్సర్ వచ్చే అవకాశం) బిస్కెట్లలో ఓరియో(Oreo), మేరీ(Marie), ప్రెట్జ్(Pretz) వేఫర్లు కూడా ఉన్నాయి.

మరోవైపు అధ్యయనం కోసం వినియోగించిన 60 బిస్కెట్లలో 56 బిస్కెట్లలో 3 MCPDగా పిలువబడే ఓ రసాయన సమ్మేళనాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇది మూత్రపిండాలు, పునరుత్పత్తి అవయవాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందట. 60 కేజీలు బరువున్న ఓ వ్యక్తి.. ఈ రసాయన సమ్మేళనాన్ని 120 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని బిస్కెట్లు.. ప్రతీ కేజీకి 2 వేల గ్రాముల 3 MCPD రసాయన సమ్మేళనం ఉంది. ఉంటుంది. అలాగే 33 బిస్కెట్ శాంపిల్స్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నట్లు.. 27 బిస్కెట్ శాంపిల్స్‌లో చక్కెర, సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం హాంగ్‌కాంగ్‌లో జరిగినప్పటికీ.. బయట మార్కెట్లకు సైతం ఇది వర్తిస్తుందని పరిశోధకులు తెలిపారు. బిస్కెట్లలో చక్కెర, కొవ్వు శాతాలు అధిక పరిమాణంలో ఉన్నాయని తేల్చారు.

మరోవైపు 2017లో, భారతదేశ వినియోగదారు విద్య పరిశోధన కేంద్రం.. దేశంలో తయారు చేయబడుతున్న క్రీమ్ బిస్కెట్లలో చక్కెర, కొవ్వు శాతం మోతాదుకు మించి ఉన్నట్లు కనిపెట్టింది. అలాగే ఉప్పు పరిమాణం కూడా ఎక్కువగా ఉందట. 25 గ్రాముల స్వీట్ బిస్కెట్లకు 0.4 గ్రాముల ఉప్పు ఉండాలట. అలా కాదని.. ఈ లెవెల్ దాటితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.

అటు గత 10 సంవత్సరాల నుంచి సుమారు 60 వేల మంది మహిళలపై స్వీడన్‌లో ఒక అధ్యయనం నిర్వహించగా.. వారానికి 2 నుండి 3 సార్లు బిస్కెట్లు తినే 33 శాతం కంటే ఎక్కువ మంది మహిళల్లో గర్భాశయ క్యాన్సర్.. వారానికి మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు బిస్కెట్లు తింటున్న 42 శాతం మంది మహిళల్లో ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. కాగా, బిస్కెట్లు అందరికీ అత్యంత ఇష్టమైన చిరుతిండి కావచ్చు. అయితే మాత్రం వాటిని మోతాదులోనే తినాలని.. అధికంగా తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read:

ఆ ఇంటివారికి పెరట్లోకి వెళ్లాలంటే భయం.. తలకు హెల్మెట్‌ పెట్టాల్సిందే.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు..

కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!

పెరుగు బెస్టా.. మజ్జిగ బెటరా.! ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పెళ్లికాని అబ్బాయిలకు షాక్.. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట! విస్తుపోయే విషయాలు..

అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..