Lakshmi Charu: ఈ తరానికి తెలియని గోదావరిజిల్లాల సంప్రదాయ వంట.. లచ్చించారు. తయారీ ఎలా అంటే
Lakshmi Charu: గోదావరిజిల్లా వాసులు బాగా ఇష్టపడే ఓ చారు.. లచ్చించారు. ఈ సంప్రదాయ వంట.. ఆ జిల్లాల్లోని నేటి తరానికే కాదు.. బహుశా..
Lakshmi Charu: గోదావరిజిల్లా వాసులు బాగా ఇష్టపడే ఓ చారు.. లచ్చించారు. ఈ సంప్రదాయ వంట.. ఆ జిల్లాల్లోని నేటి తరానికే కాదు.. బహుశా రాయలసీమ, తెలంగాణా తెలిసి ఉండకపోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే పాతకాలపు వంట లక్ష్మీచారు.. లచ్చించారుని కొంతమంది తరవాణి అని కూడా పిలుస్తారు. రెండు మూడు తరాలకు ముందు లచ్చించారు తరచుగా చేసుకొనే ఓ వంటకం. కమ్మదనానికి కమ్మదనం.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ ‘లచ్చించారు’. అందుకే అప్పట్లో పెద్దలు, పిల్లలలు లచ్చించారుని లొట్టలేసుకుంటూ తింటారు. ఈరోజు అలనాటి సంప్రదాయ వంట లచ్చించారు తయారీ గురించి తెలుసుకుందాం.. ముందుగా కొత్త మట్టి కుండను తీసుకుని శుభ్రంగా కడిగి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి.. వంటింట్లో ఓ మూల చుట్టుకుదురు పై ఉంచేవారు. దీనినే కురాడు కుండ అని కూడా అంటారు. ఈ కుండలో రెండో సారి బియ్యం కడిగిన నీళ్లు ,అన్నం వారిస్తే వచ్చే గంజిని పోసి నిల్వ ఉంచేవారు. మూడు రోజులు తరువాత ఆ కుండలోని నీరు పులుస్తాయి.. అప్పుడు ఆ పైన తేట తీసి పారబోసి.. చిక్కని ద్రవాన్ని లచ్చించారుగా తాయారు చేస్తారు.
కావాల్సిన పదార్ధాలు:
బెండాకాయలు, వంకాయ, తోటకూర కాడలు, మునక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి , పసుపు, కారం, ఉప్పు రుచికి సరిపడా
తాలింపు: ఆవాలు ఎండుమిర్చి కొత్తిమీర
తయారీ విధానం: ఒక దళసరి గిన్నె తీసుకుని ముందుగా కుండ నుంచి తీసుకున్న చిక్కని ద్రవంలో తీసుకున్న కూరగాయల ముక్కలను వేసి మరగ పెడతారు. మంసా హరులైతే ఎండు రొయ్యలు కూడా వేసుకుంటారు. మరిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేస్తారు. బాగా మరిగించిన తర్వాత తాలింపు వేస్తారు. అంటే రుచికరమైన ఘుమ ఘుమలాడే లచ్చించారు రెడీ. దీనిని అన్నం లో కలుపుకుని తింటే ఓహో అనాల్సిందే ఎవరైనా అని అంటారు.
మన పూర్వీకులు బాగా ఇష్టంగా చేసుకున్న ఈ వంట ఇప్పుడు మరుగున పడిపోయింది. ఈ లచ్చించారు లో ఎన్నో పోషక విలువలున్నాయని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ గోదావారి జిల్లోని కొన్ని ఇల్లల్లో తర్వాణి కుండ ఉంటుంది. వీలయితే గోదావరి గ్రామాలు వెళ్లినపుడు ఓ మారు తినిరండి, అయ్. యిది ఈరోజు లచ్చించారు తయరు చేసే విధానం
Also Read: దేశానికి వచ్చిన గిఫ్ట్‌లను ప్రధాని అమ్మేస్తూ.. సొంత ఖాతాలో వేసుకున్నాడంటూ ఆరోపణలు