Curd Vs Buttermilk: పెరుగు బెస్టా.. మజ్జిగ బెటరా.! ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
పెరుగు, మజ్జిగ.. ఈ రెండింటిలో శరీరానికి ఏది మంచిది.? ఇప్పటికీ ఈ ప్రశ్న చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది...
పెరుగు, మజ్జిగ.. ఈ రెండింటిలో శరీరానికి ఏది మంచిది.? ఇప్పటికీ ఈ ప్రశ్న చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. పెద్దలు అయితే.. పెరుగు పెరుగే.. మజ్జిగ మజ్జిగే అంటారు. అయితే పెరుగు కంటే మజ్జిగతో ఎక్కువ లాభాలు పొందొచ్చు. గ్లాసుడు మజ్జిగ మన శరీరాన్ని వేడి నుంచి రక్షిస్తుంది. రిలీఫ్‌ను ఇస్తుంది. ఎక్కువ మసాలు ఉండే ఫుడ్ తిన్న తర్వాత మజ్జిగ తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. అలాగే కడుపులో బాధ, నొప్పి వంటి సమస్యలను మజ్జిగ దూరం చేస్తుంది.
ఇదిలా ఉంటే పెరుగులో ప్రోటీన్స్ అధిక శాతంలో ఉంటాయి. ప్రోటీన్ లోపం ఉన్నవారు పెరుగును తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. పెరుగు, మజ్జిగ.. రెండింటిలోనూ విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉన్నాయి. వీటి మధ్య స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది.
పెరుగు, మజ్జిగను వేర్వేరు పరిస్థితుల్లో తీసుకోవడం వల్ల వేర్వేరు ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగు తినడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు. కాబట్టి పెరుగు కూడా శరీరానికి చాలా ఉపయోగకరం. అలాగే బరువు తగ్గాలనుకున్నవారు మజ్జిగ తీసుకోవడం చాలా ఉత్తమం. కాల్షియంతో పాటు ఎన్నో విటమిన్లు మజ్జిగలో పుష్కలంగా ఉన్నాయి. అవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.
Also Read: