Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కోడి గుడ్లతో మరో లాభం కూడా.. అదేంటో తెలిస్తే నమ్మరేమో మరీ..!

Health Tips: బక్కగా ఉన్న వారికి, బలం తక్కువగా ఉన్న వారికి కోడి గుడ్లు తినమంటూ డాక్టర్లు సూచిస్తారు. ఉడకబెట్టిన కోడి గుడ్లతో ఆరోగ్యమని మన పెద్దలు కూడా చెబుతుంటారు.

Health Tips: కోడి గుడ్లతో మరో లాభం కూడా.. అదేంటో తెలిస్తే నమ్మరేమో మరీ..!
Boiled Egg
Follow us
Shiva Prajapati

| Edited By: Phani CH

Updated on: Oct 21, 2021 | 6:21 AM

Health Tips: బక్కగా ఉన్న వారికి, బలం తక్కువగా ఉన్న వారికి కోడి గుడ్లు తినమంటూ డాక్టర్లు సూచిస్తారు. ఉడకబెట్టిన కోడి గుడ్లతో ఆరోగ్యమని మన పెద్దలు కూడా చెబుతుంటారు. అయితే, కోడి గుడ్లు తినడం వల్ల లావు అవుతారని అందరూ భావిస్తుంటారు. అందుకే అధిక బరువుకు భయపడి కోడిగుడ్లను మితంగా తింటుంటారు. కానీ, అధిక బరువు పెరుగుతారనే గుడ్డి నమ్మకాన్ని యూఎస్‌ కు చెందిన ఓ ప్రముఖ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పటాపంచల్ చేశారు. బరువు తగ్గాలన్నా కూడా కోడి గుడ్డు తినాల్సిందేనని, ఇది మంచి ఔషదం చెబుతున్నారు. బరువును పెంచే కోడి గుడ్డును ఉపయోగించి.. బరువును ఈజీగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ కోడిగుడ్డు బరువు తగ్గించడం ఏంది? ఈ కథ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా అధిక బరువు, ఉబకాయంతో బాధపడేవారు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించాలి. రెగ్యులర్‌గా తినేదాని కన్నా కనీసం 50 శాతం తక్కువ తినాలి. అప్పుడే బరువు తగ్గే అవకాశం ఉంది. కాని అలా తక్కువ తినడం వల్ల గ్యాస్‌ ఫామ్‌ అవ్వడం, ఆకలిగా ఉండటం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. తక్కువ తిన్న సమయంలో ఆకలి లేకుండా ఉండేందుకు.. గుడ్డు తినాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గుడ్డులో ఉండే పోషకాలు, ఇతర పదార్థాలు ఆకలిని తగ్గిస్తాయని, దాంతో తక్కువ ఆహారం తింటారని అంటున్నారు. ఫలితంగా బరువు కూడా తగ్గుతారని యూఎస్‌ యూనివర్శిటీ నిపుణులు నిర్థారించారు.

ఆహారం తక్కువ తీసుకున్న సమయంలో ఒక గుడ్డు తీసుకుంటే పర్వాలేదు. కాని రోజులో ఎక్కువ కోడి గుడ్లు తీసుకుంటూ ఆహారం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా వరకు బరువు పెరుగుతారని తెలిపారు. బరువు తగ్గాలంటే గుడ్లను మితంగా తీసుకుని ఆహారం తగ్గించుకోవాలని సూచించారు. ఈ చిన్న చిట్కాను పాటించడం వల్ల రెండు లేదా మూడు వారాల్లో మీ బరువులో ఖచ్చితంగా తేడా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. మరి కోడి గుడ్లను మితంగానే కుమ్మేయండి.

Also read:

Telangana News: ఇదేం పిట్టరా బాబోయ్‌.. హెల్మెట్ ఉంటేనే పెరట్లోకి వెళ్లాలి.. లేదంటే అంతే సంగతి..!

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..