Telangana Corona: తెలంగాణ కరోనాకి సంబంధించి సంచలన విషయలు బయటపెట్టిన హెల్త్ డైరెక్టర్
సెకండ్ వేవ్ నుంచి కాస్తా తేరుకున్నాక, కరోనాపై చాలా మందిలో భయం పోయింది. దీంతో కొందరు మాస్క్‌లు కూడా ధరించడం లేదు. రోడ్ల మీద విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.

Telangana Corona: సెకండ్ వేవ్ నుంచి కాస్తా తేరుకున్నాక, కరోనాపై చాలా మందిలో భయం పోయింది. దీంతో కొందరు మాస్క్‌లు కూడా ధరించడం లేదు. రోడ్ల మీద విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. మరికొందరు వ్యాక్సిన్ తీసుకోవడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికి వరకు ఫస్ట్ డోస్ తీసుకోని వాళ్లు కూడా లక్షల మంది ఉన్నారని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల్లో కరోనా భయం తగ్గిపోవడంతో వాక్సిన్ తీసుకొనే వారి సంఖ్య కూడా తగ్గుతోందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. ఇప్పటికే డ్యూ డేట్ పూర్తి అయినా వాక్సిన్ తీసుకోనివారు తెలంగాణలో 36లక్షలకు పైగా మంది ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కరోనా బారిన పడుతున్న వారిలో వాక్సిన్ తీసుకోని వారే ఎక్కువగా ఉన్నారని శ్రీనివాసరావు తెలిపారు. కరోనా భారిన పడుతున్న వారిలో 60శాతం మంది కనీసం మొదటి డోస్ కూడా తీసుకోలేదని, ఫస్ట్ డోస్ తీసుకుని కరోనా బారిన పడుతున్నావారు 30 శాతం మంది ఉన్నారని తెలిపారు.
కేసుల సంఖ్య మళ్లీ పెరగడానికి వాక్సిన్ తీసుకోకపోవడమే కారణమన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. తెలంగాణలో వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారు 75 శాతం మంది ఉండగా, రెండో డోస్ వాక్సిన్ తీసుకున్న వారు ౩9 శాతం మంది ఉన్నారని తెలిపారు. తెలంగాణలో 50 లక్షల డోసుల వాక్సిన్ అందుబాటులో ఉందని, ఇంకా వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే టీకా తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో పాజిటివ్ రేటు 0.4 శాతంగా ఉందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
Read also: Ambati: కుట్ర అంతటికీ సూత్రధారైన చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించాలి: అంబటి రాంబాబు