Corona Virus: ఆ దేశ ప్రజలు, పాలకుల నిర్లక్ష్యం.. మళ్ళీ విజృంబిస్తోన్న కరోనా.. వారం రోజులపాటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు

Corona Virus: రష్యాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణ మృదంగం మ్రోగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా..

Corona Virus: ఆ దేశ ప్రజలు, పాలకుల నిర్లక్ష్యం.. మళ్ళీ విజృంబిస్తోన్న కరోనా.. వారం రోజులపాటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు
Russia Covid 19
Follow us
Surya Kala

|

Updated on: Oct 21, 2021 | 8:06 AM

Corona Virus: రష్యాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణ మృదంగం మ్రోగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా బాధితులు వెయ్యి మందికి పైగా మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఇలా భారీగా మరణాలు నమోదు కావడానికి ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం అనాలోచిత నిర్ణయాలు వలెనే అంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కరోనా కట్టడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్‌ 30 నుంచి నవంబర్ 7 వరకూ వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు రావొద్దని, ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి వ్యాక్సిన్‌ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రష్యా అత్యంత ప్రతిష్టాత్మకంగా రష్యా స్పూత్నిక్ వీ వ్యాక్సిన్ ను తయారు చేసి ఇతర దేశాలకు పంపిణి చేస్తున్నా.. అక్కడి ప్రజల్లో మాత్రం టీకాపై అనాసక్తి కనబరుస్తున్నారు.. దీంతో అక్కడి మరణల పెరుగుదలకు కారణమవుతుందని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కరోనాను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే ప్రధాన అవకాశంగా పలుదేశాలు భావిస్తూ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వ్హహిస్తున్నాయి.

గత 24 గంటల్లో 1,028 మంది కోవిడ్ -19తో మరణించారు. ఇది ఆ దేశంలో కరోనాతో ఈ రేంజ్ లో మరణించడం ఇదే మొదటిసారి. ఇక కొత్తగా 34,074 మందికి కరోనావైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. కరోనా మరణాల్లో రష్యా ఐరోపా దేశాల్లో మొదటి ప్లేస్ లో నిలిచింది. దీంతో మహమ్మారి తీవ్రతను ప్రభుత్వం తక్కువగా అంచనా వేసిందని రష్యన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ ప్రక్రియ మందగించింది. దీంతో మాస్కో మేయర్ సెర్గీ సోబయానిన్ మళ్ళీ కరోనా వైరస్ కట్టడి కోసం ఆంక్షలను విధించారు. రష్యా రాజధాని మాస్కో లో 60 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుండి పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా టీకాలు ఇవాలని చెప్పారు. కోవిడ్ ఆంక్షలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని.. 2022 ఫిబ్రవరి చివరి వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో వెళ్ళాలంటే యాక్సెస్ కోసం QR కోడ్‌లను అనేక ప్రాంతాలు తిరిగి ప్రవేశపెట్టాయి.

Also Read:  ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. నేడు ఏ రాశివారికి ఏవిధంగా ఉన్నదంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!