Viral News: కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!
సాధారణంగా పాములు కనిపించినప్పుడు మనం వాటిని కర్రతో కొట్టి దూరంగా పంపించేయడం గానీ.. చంపడం గానీ చేస్తుంటాం. అయితే..
సాధారణంగా పాములు కనిపించినప్పుడు మనం వాటిని కర్రతో కొట్టి దూరంగా పంపించేయడం గానీ.. చంపడం గానీ చేస్తుంటాం. అయితే అదే పాము ఒక్కసారిగా మన మీదకు బుసలు కొడుతూ వస్తే.. ఇంకేమైనా ఉందా గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఒక వ్యక్తికి ఎదురైంది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీలో చోటు చేసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది.? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎసెక్స్ కౌంటీలోని ఓ షిప్‌మెంట్ సంస్థలో పని చేస్తోన్న ఒక వ్యక్తి దక్షిణాసియాలోని అత్యంత ప్రమాదకరమైన పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఇండియా నుంచి వచ్చిన ఓ రాళ్ల కంటైనర్‌ను అతడు అన్‌లోడ్ చేస్తుండగా.. దానిలో నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అరె.! మూసి ఉన్న కంటైనర్ నుంచి ఏంటీ వింత శబ్దాలు అనుకున్న అతడు.. మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవి క్రమేపి పెద్దగా వస్తుండటం.. అంతేకాకుండా ఏదో బుసలు కొడుతున్నట్లుగా వినిపిస్తుండటంతో ఏదైనా పాము దూరి ఉంటుందేమోనని అనుకున్నాడు.
#WarningSigns #Viral #Trending pic.twitter.com/wnMAvR15vz
— telugufunworld (@telugufunworld) October 21, 2021
ఇక దానిని పట్టుకునే క్రమంలో భయంగానే కంటైనర్‌ను ఓపెన్ చేశాడు. అంతే.! ఇంకేముంది ఒక్కసారిగా ఆ డేంజరస్ వైపర్ పాము బుసలు కొడుతూ కాటు వేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కాటు నుంచి ఎలాగోలా ఆ వ్యక్తి తప్పించుకున్నాడు. అంతేకాకుండా అతడు ఆ పామును చాకచక్యంగా పట్టుకుని ఓ పెట్టెలో బంధించాడు. దాన్ని వైల్డ్ లైఫ్ అధికారులకు అప్పగించాడు. ఇక వాళ్లు ఆ పాము ఉన్న పెట్టెను సౌత్ ఎసెక్స్ వైల్డ్ లైఫ్ హాస్పిటల్‌లోకి తరలించారు. అక్కడ ఒక గదిలో ఆ పెట్టెను పెట్టి లాక్ వేశారు. అంతేకాకుండా ఆ గదిలోకి ఎవరూ వెళ్లకుండా వార్నింగ్ సైన్స్(Warning Signs) ఉన్న బోర్డులను అంటించారు.
— telugufunworld (@telugufunworld) October 21, 2021
కాగా, ఈ పాముకు సంబంధించిన విషయాల గురించి ఆ హాస్పిటల్‌లోని డాక్టర్ స్యూ స్క్వార్ మాట్లాడుతూ.. ”పామును కనిపెట్టినవారు అదృష్టవంతులు. బహుశా.! ప్రయాణ బదలిక కారణంగా ఆ వైపర్ పాము చురుకుగా లేకపోవడంతో.. దాని కాటు నుంచి చాకచక్యంగా తప్పించుకోగలిగారు. ఈ పాములు తమకు హాని తలపెడతారని అనుకున్న క్షణాల్లో కాటు వేసేస్తాయి. ఈ జాతికి చెందిన పాములు ఎక్కువగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ అంతటా కనిపిస్తాయి. ఈ పాము విషంలో మెటల్లోప్రొటీనేసెస్ అని పిలువబడే ఎంజైమ్‌లు ఉంటాయి. అవి మనుషుల రక్తస్రావాన్ని అడ్డుకోవడమే కాకుండా.. క్షణాల్లో మృత్యువును తీసుకొస్తాయి”. అని పేర్కొన్నారు.
Also Read:
ఆ యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా.. వివరాలివే..
పెరుగు బెస్టా.. మజ్జిగ బెటరా.! ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
టీ20ల్లో కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ.? వరల్డ్‌కప్ తర్వాత అఫీషియల్ ప్రకటన.!