పెళ్లికాని అబ్బాయిలకు షాక్.. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట! విస్తుపోయే విషయాలు..

పెళ్లికాని ప్రసాద్‌లకు చైనా అమ్మాయిలు షాకిస్తున్నారు. చైనాలో పెళ్లికాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు 50 శాతం మంది...

పెళ్లికాని అబ్బాయిలకు షాక్.. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట! విస్తుపోయే విషయాలు..
Marriage

పెళ్లికాని ప్రసాద్‌లకు చైనా అమ్మాయిలు షాకిస్తున్నారు. చైనాలో పెళ్లికాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు 50 శాతం మంది మహిళలు ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీనికి కారణం ఏంటన్నదానిపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో విస్తూపోయే విషయాలు తెలిశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాలో పెళ్లి పట్ల అక్కడి మహిళల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఓ సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం 2వేల 905 మంది పెళ్లికాని వాళ్లు ఉన్నారు. వారి వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరిలో దాదాపు 44 శాతం మంది మహిళలు పెళ్లి గురించి ఆలోచించడం లేదట. అంతేకాదు 25 శాతం పురుషులు కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదని తెలిసింది.

సర్వేలో పాల్గొన్న ఎక్కువ శాతం మంది తమకు పెళ్లి చేసుకోవడానికి సమయం శక్తి లేదని చెప్పారట..వీటితోపాటు ఆర్థిక కారణాలతోనూ కొందరు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. వీటిలో మూడోవంతు మంది తమకు పెళ్లిపై నమ్మకం లేదని చెప్పారట. తమను ప్రేమించే వారు దొరకడం లేదని మరికొందరు చెప్పారు. ఇదిలా ఉంటే, ఒక్క సంతానం మాత్రమే ఉండాలనే నిబంధనను చైనా ప్రభుత్వం సడలించింది. 1979లో జనాభాను నియంత్రించేందుకు తీసుకొచ్చిన చటాన్ని మూడు దశాబ్దాల తరువాత సడలించింది.

Also Read:

Click on your DTH Provider to Add TV9 Telugu