Bathukamma: రేపే విశ్వవేదిక బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన.. హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

Burj Khalifa - Bathukamma : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ.. గొప్పతనాన్ని విశ్వ వేదికపై చాటేందుకు సర్వం సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో

Bathukamma: రేపే విశ్వవేదిక బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన.. హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
Burj Khalifa Bathukamma
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 22, 2021 | 2:45 PM

Burj Khalifa – Bathukamma : తెలంగాణ పూల పండుగ బతుకమ్మ.. గొప్పతనాన్ని విశ్వ వేదికపై చాటేందుకు సర్వం సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం (23 వ తేదీ) న ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించనున్నారు. దీనికోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే తెర (స్క్రీన్) రజమా ప్రపంచంలోనే అతి పెద్దది కావడం మరో విశేషం. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై బతుకమ్మను వీక్షించనున్నారు. రేపు రాత్రి 9.40 నిమిషాలకు, 10.40 నిమిషాలకు ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోను ప్రదర్శించనున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమర్చిన ఎల్‌ఈడీ తెరలపై శనివారం రాత్రి రెండు సార్లు ప్రదర్శించనున్నారు.

బతుకమ్మ పండుగ ద్వారా మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు సాయంత్రం దుబాయ్‌లో జరగబోయే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

కాగా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. 2004 జనవరి 6న బుర్జ్ ఖలీఫా నిర్మాణం మొదలవగా, 2020 జనవరి 4న ఈ భవనాన్ని ప్రారంభించారు. 829.8 మీటర్ల ఎత్తు గల ఈ భవనంలో మొత్తం 163 అంతస్తులున్నాయి. అత్యంత వేగంతో వెళ్లే 57 అధునాతన సాంకేతికతతో కూడిన లిప్టులను ఈ భవనంలో అమర్చారు.

Also Read:

CP Mahesh Bhagwat: హోంగార్డు తల్లికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాదాభివందనం.. వీడియో

Andhra Pradesh: ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమంపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు