Andhra Pradesh: ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమంపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్లాప్‌ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా రివ్యూ చేశారు సీఎం.

Andhra Pradesh: 'క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌' కార్యక్రమంపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు
Cm Jagan
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 22, 2021 | 7:27 PM

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్లాప్‌ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా రివ్యూ చేశారు సీఎం. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు.  వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని సూచించారు. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  గ్రేడ్‌-2, 3… నగరపంచాయతీలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ కూడా ఆయా నగరాలకు, పట్టణాలకు, పంచాయతీలకు చేరవేయాలని, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను వీలైనంత తర్వగా తెప్పించుకోవాలని సీఎం సూచించారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడుకుని ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగరాలు, పట్టణాల్లో గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  ఎప్పటికప్పుడు గార్బేజ్‌ను తొలగించడమే కాకుండా దుర్వాసన ఆ ప్రాంతంలో రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు వ్యర్థాలనుంచి విద్యుత్‌ ఉత్పత్తి కర్మాగారం సిద్ధమైందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ప్లాంట్లపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించడంపైనే కాదు, వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో డస్ట్‌బిన్స్‌ లేని వాళ్లకు డస్ట్‌బిన్స్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలని సూచించారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యంపైనా నివేదికలు తెప్పించుకుని. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా తాగునీటి వాటర్‌ ట్యాంక్‌లను పరిశుభ్రం చేయించాలని సీఎం సూచించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.  మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ఎక్కడా కూడా మురుగునీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. నివాస ప్రాంతాల్లో మురుగునీటి నిల్వ లేకుండా చేయాలని, దీన్నొక సవాల్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలన్నారు. క్లాప్‌ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూపంలో సమర్థులైన అధికారులను పెట్టాలని సీఎం జగన్ సూచించారు. అక్కడికి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read:పేలిన సిలిండర్.. కూలిన బ్రతుకులు.. ఆ పేద రైతు కల చెదిరిపోయింది.. చివరికి కన్నీరే మిగిలింది..

MAA: ‘మా’లో బిగ్ ట్విస్ట్.. ఎన్నికల కేంద్రంలో రౌడీషీట్ ఉన్న వ్యక్తి గుర్తింపు..

రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు..! వీడియో
రద్దీ రోడ్డుపై పొర్లిపొర్లి చితకబాదుకున్న వ్యాపారులు..! వీడియో
17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిన.
17 ఏళ్లకే హీరోయిన్‏గా ఎంట్రీ.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికిన.
టీమిండియా షాకింగ్ న్యూస్.. భారత్‌కు తిరిగిరానున్న గంభీర్
టీమిండియా షాకింగ్ న్యూస్.. భారత్‌కు తిరిగిరానున్న గంభీర్
తండ్రి హమాలీ..కూతురికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ లక్ష్యం
తండ్రి హమాలీ..కూతురికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ లక్ష్యం
క్షీణించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆరోగ్యం..!
క్షీణించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆరోగ్యం..!
రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు..ఇదిగో జాబితా
రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు..ఇదిగో జాబితా
పంజా విసురుతున్న చలి పులి.. పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్!
పంజా విసురుతున్న చలి పులి.. పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్!
పిల్లల లంచ్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. జాగ్రత్త సుమా
పిల్లల లంచ్ బాక్స్ లో ఈ ఆహారాన్ని పెడుతున్నారా.. జాగ్రత్త సుమా
మెగా వేలం తర్వాత అత్యంత బలమైన, బలహీనమైన జట్లు ఏవంటే?
మెగా వేలం తర్వాత అత్యంత బలమైన, బలహీనమైన జట్లు ఏవంటే?
అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ.. ఎక్కడంటే?
అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇరిగేషన్‌ ఏఈ.. ఎక్కడంటే?
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
గుండెలు పిండేసే ఘటన.. ఏ జంతువుకూ ఈ దుస్థితి రాకూడదు
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
పెళ్లి ఫిక్సయ్యాక ప్రియుడు జంప్‌.. బాధితురాలు చేసింది ఇదే !!
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??
బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??