Telangana: పేలిన సిలిండర్.. కూలిన బ్రతుకులు.. ఆ పేద రైతు కల చెదిరిపోయింది.. చివరికి కన్నీరే మిగిలింది..

వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా పది లక్షల నోట్లు కాలిపోయాయి. భద్రంగా బీరువాలో పెట్టిన డబ్బులు కళ్ల ముందే కాలిబూడిదయ్యాయి. దాచుకున్న డబ్బులు అగ్నికి ఆహుతి కావడంతో.. ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.

Telangana: పేలిన సిలిండర్.. కూలిన బ్రతుకులు.. ఆ పేద రైతు కల చెదిరిపోయింది.. చివరికి కన్నీరే మిగిలింది..
Gas Cylinder Blast
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 22, 2021 | 1:48 PM

ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలడంతో.. 10 లక్షల రూపాయాలు దగ్ఢమైయ్యాయి. కరెన్సీ కాలిపోయిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో జరిగింది. కప్పల లక్ష్మయ్య అనే రైతు తన తండ్రికి చెందిన ఉమ్మడి భూమిని విక్రయించగా 10 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ క్రమంలో 10 లక్షల నగదును బీరువాలో దాచిపెట్టాడు. అవసరాలకు పనికి వస్తుందని లెక్కలు వేసుకున్నాడు. గ్రామంలోనే మరో చోట కొంత భూమి కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు. దానికి సంబంధించి స్థలం, సామగ్రి, మేస్త్రీ ఇతర పనులన్ని దాదాపుగా పూర్తయ్యాయి.  అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు దాటికి లక్ష్మయ్య పూరి గుడిసె మంటల్లో కాలిపోయింది. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయింది. ఈ పూరి గూడెసెలోనే ఉన్న బీరువాలోని 10 లక్షలు కూడా కాలి బూడిదయ్యాయి.

కొన్ని నోట్లు పూర్తిగా కాలిపోగా.., ఇంకొన్ని నోట్లు పాక్షికంగా కాలిపోయాయి. వాటితోపాటే ఆ రైతు సొంతింటి కల కూడా బూడిదైపోయింది. దీంతో లక్ష్మయ్య కుటుంబం కన్నీటి వేదన వర్ణనాతీతంగా మారింది. లక్ష్మయ్య కుటుంబ సభ్యులను ఓదార్చలేకపోతున్నారు స్థానికులు. మంటల్లో నగదుతోపాటు వ్యవసాయ పాస్​బుక్​లు, ఎల్​ఐసీ పత్రాలు, ఇతర సామగ్రి కూడా కాలిపోయింది. ఇక తన జీవితంలో సొంత ఇల్లు కట్టుకోలేనేమోనని కన్నీరుపెట్టుకున్నాడు ఆ పేద రైతు. ఇలా దాచుకున్న సొమ్ము అగ్నికి ఆహుతి కావడంతో.. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు లక్ష్మయ్య.

Also Read: ‘మా’లో బిగ్ ట్విస్ట్.. ఎన్నికల కేంద్రంలో రౌడీషీట్ ఉన్న వ్యక్తి గుర్తింపు..

Telangana: ‘అయ్యో పాపం’ అని లిఫ్ట్ ఇస్తే.. చుక్కలు చూపించారు

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్