MAA: ‘మా’లో బిగ్ ట్విస్ట్.. ఎన్నికల కేంద్రంలో రౌడీషీట్ ఉన్న వ్యక్తి గుర్తింపు..

'మా'..లో ట్విస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. సీరియల్‌ ఎపిసోడ్‌లా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్‌గా మరో బాంబు పేల్చారు మోనార్క్‌.

MAA: 'మా'లో బిగ్ ట్విస్ట్.. ఎన్నికల కేంద్రంలో రౌడీషీట్ ఉన్న వ్యక్తి గుర్తింపు..
Maa Twist
Follow us
Ram Naramaneni

| Edited By: Rajeev Rayala

Updated on: Oct 22, 2021 | 4:25 PM

‘మా’..లో ట్విస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. సీరియల్‌ ఎపిసోడ్‌లా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్‌గా మరో బాంబు పేల్చారు మోనార్క్‌. రౌడీషీటర్లు ‘మా’ ఎన్నికల్ని ప్రభావితం చేశారని ఆరోపించారాయన. ఇదే విషయాన్ని మరోసారి ఈసీ కృష్ణమోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ రోజున జరిగిన తిట్లదండకం, బెదిరింపులకి సంబంధించి సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని ఇప్పటికే కోరారు. ఇప్పుడు మరోసారి రౌడీషీటర్ల పాత్ర ఉందంటూ లేఖాస్త్రం సంధించారు. ‘మా’ ఎన్నికలు.. అందులో ఓటమిని అంత ఈజీగా ప్రకాష్ రాజ్‌ మరచిపోయేలా కనిపించడం లేదు. అక్రమాలు, అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. ఆ నిజాలన్నీ జనాలందరికి తెలపాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది.

పోలింగ్‌, కౌంటింగ్ ప్రక్రియలో సామాజిక వ్యతిరేకుల ఉనికి ఉందంటూ పదేపదే ప్రశ్నించాం. అలాంటి వారిని కౌంటింగ్‌ ప్రాంతాలకు అనుమతించారని ఆరోపించాం. కానీ ఆ ఆరోపణలు మీరు ఖండించారంటూ ఈసీ రాసిన లేఖలో పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. విష్ణు ప్యానల్ నుంచి చాలామందిని నల్ల బ్యాడ్జీలతో ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ‘మా’..కి సంబంధం లేని వ్యక్తులను అనుమతించకూడదు. కానీ అవేవీ పట్టించుకున్నట్టు కనిపించలేదని లేఖలో ఆరోపించారు ప్రకాష్‌. ప్రధానంగా ‘మా’ ఎన్నికల్లో రౌడీషీటర్‌ నూకల సాంబశివరావు పాల్గొన్నారని ప్రకాష్‌ రాజ్ ఆరోపిస్తున్నారు. ఇతడిపై జగ్గయ్యపేట పీఎస్‌లో రౌడీషీట్ ఉంది. గతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అనేక బెదిరింపులు, సెటిల్‌మెంట్ల కేసులు ఉన్నాయి. నోట్ల రద్దు సమయంలో కోట్ల రూపాయలు తరలిస్తుండగా.. అడ్డుకోబోయిన ఎస్సైని కారుతో ఢీకొట్టాలని చూశాడు.

‘ఎన్నికల రోజున ఓ వ్యక్తి పోలింగ్‌ సమీపంలోనే తిరిగాడు. అతనికి క్రిమినల్ బ్యాగ్రౌండ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్‌ చాలా ఉన్నాయి. అందుకే స్పష్టమైన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. కొంతమంది పోలింగ్‌ రోజున హాల్‌లోనే తిరిగారు’ అని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.

Also Read: పైనుంచి చూస్తే పత్తి చేనే అనుకుంటారు… లోపలకు దిగి చెక్ చేసిన అధికారులు షాక్

Telangana: ‘అయ్యో పాపం’ అని లిఫ్ట్ ఇస్తే.. చుక్కలు చూపించారు