Telangana: ‘అయ్యో పాపం’ అని లిఫ్ట్ ఇస్తే.. చుక్కలు చూపించారు
లిఫ్ట్ అడిగారు.. అయ్యో పాపమని కారో, బైకో ఎక్కించుకుంటున్నారా. అయితే తస్మాత్ జాగ్రత్త!. ఈ ఘటన గురించి తెలిశాక.. మీరు లిఫ్ట్ ఇవ్వాలంటే ఒకటికి, 100 సార్లు ఆలోచిస్తారు.
లిఫ్ట్ అడిగారు.. అయ్యో పాపమని కారో, బైకో ఎక్కించుకుంటున్నారా. అయితే తస్మాత్ జాగ్రత్త!. ఈ ఘటన గురించి తెలిశాక.. మీరు లిఫ్ట్ ఇవ్వాలంటే ఒకటికి, 100 సార్లు ఆలోచిస్తారు. వివరాల్లోకి వెళ్తే… నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ కుమార్‌కు ఓ కుమార్తె ఉంది. ఆమె ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో మెడిసిన్ కోర్స్ చేస్తోంది. బుధవారం సాయంత్రం అనిల్‌కుమార్ తన కూతురుని రిమ్స్‌లో వదిలి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. నేరడిగొండ టోల్‌ప్లాజా దగ్గర్లో.. ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడిగారు. ఎలాగో కారులో ఒక్కడే ఉన్నాడు కాబట్టి.. కాస్త హెల్పింగ్ నేచర్‌తో లిఫ్ట్ ఇచ్చాడు. ‘అయ్యో పాపం’.. అని కారులో ఎక్కించుకోవడమే.. అతన్ని నిలువునా ముంచేసింది. వారిని ఎక్కించుకొని కొద్ది దూరం వెళ్లాక.. ఆ వ్యక్తులు వారి యాక్షన్ ప్లాన్ షురూ చేశారు. దుండగులు గన్‌తో అనిల్‌కుమార్‌కు బెదిరించారు. కాళ్ళు చేతులు కట్టేశారు. నోటికి ప్లాస్టర్ అతికించి పిచ్చిపిచ్చిగా కొట్టారు. కారును మహారాష్ట్రలోని పండర్ కౌడా వైపు తీసుకెళ్లారు. పండర్ కౌడా దగ్గర్లో.. కారు అపారు. అనిల్‌కుమార్ దగ్గరున్న రూ.11 వేలు, మెడలోని గోల్డ్ చైన్ లాక్కున్నారు. అతడిని రోడ్డుపై పడేసి.. కారుతో ఎస్కేప్ అయ్యారు. వెంటనే అక్కడి పోలీసులను అనిల్‌కుమార్ సంప్రదించాడు. వారి సహాయంతో నెరడిగొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. స్పెషల్ టీమ్స్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో.. స్థానికుల్లో టెన్షన్ నెలకుంది.
సమాజం ఇప్పుడు అంత గొప్పగా ఏం లేదు. మోసాలు పెరిగిపోయాయి. మంచితనంతో సాయం చేస్తే నిండా ముంచేస్తున్నారు. కాబట్టి అపరిచితులైనా, పరిచితులైనా సాయం చేసేముందు పదే, పదే ఆలోచించుకోండి. లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Also Read: ప్రేమను నిరాకరించిన యువతికి యువకుడి గిఫ్ట్.. అందులో ఏముందో తెలిస్తే మైండ్ బ్లాంక్