Vizag: ప్రేమను నిరాకరించిన యువతికి యువకుడి గిఫ్ట్… అందులో ఏముందో తెలిస్తే మైండ్ బ్లాంక్

అతడు ఆమెను ప్రేమించాడు. ఆమె మాత్రం అతడి ప్రేమను రిజెక్ట్ చేసింది. దీంతో కక్ష పెంచుకున్నాడు. ఆమెను చిక్కుల్లో పడేయాలని ఓ గిఫ్ట్ ఇచ్చాడు. చివరికి తానే చిక్కుల్లో పడ్డాడు.ఆ గిఫ్ట్​ ఏంటో తెలిస్తే మీరూ షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే..

Vizag: ప్రేమను నిరాకరించిన యువతికి యువకుడి గిఫ్ట్... అందులో ఏముందో తెలిస్తే మైండ్ బ్లాంక్
Love Revange
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 22, 2021 | 8:37 AM

అతడు ఆమెను ప్రేమించాడు. ఆమె మాత్రం అతడి ప్రేమను రిజెక్ట్ చేసింది. దీంతో కక్ష పెంచుకున్నాడు. ఆమెను చిక్కుల్లో పడేయాలని ఓ గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ప్లాన్ రివర్స్ అయ్యింది. చివరికి తానే చిక్కుల్లో పడ్డాడు. ఆ గిఫ్ట్​ ఏంటో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. అసలేం జరిగిందంటే.. వైజాగ్‌కు చెందిన వినయ్‌కుమార్‌(25) ప్రైవేట్‌ కంపెనీలో డేటా ఎంట్రీ జాబ్ చేస్తున్నాడు. తనతోపాటు చదువుకున్న అదే ప్రాంతానికి చెందిన యువతిని లవ్ చేశారు. ఆ విషయం ఆమెకు చెబితే.. ఇలాంటివన్నీ తనకు సెట్ కావని చెప్పింది. ఫ్రెండ్షిప్ వరకూ అయితే ఓకే చెప్పింది. తన ప్రేమను నిరాకరించడంతో అతడు కక్ష పెంచుకున్నాడు. ఈవెంట్స్‌ నిర్వాహకురాలు అయిన ఆమె ఆ పనిపై 2018 మే 31న మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి శిర్డీసాయి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు బయల్దేరింది. ఇది తెలుసుకుని వచ్చిన అతడు.. స్నేహానికి గుర్తుగా గిఫ్ట్‌ అని నమ్మించి 3 కిలోల గంజాయి ప్యాకెట్‌ ఇచ్చాడు.  నెక్ట్స్ డే  ట్రైన్ సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకునే ముందే.. ఆ యువతి గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు జీఆర్పీ వారికి సమాచారం అందించాడు. రైలు స్టేషన్‌కు రాగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఫ్రెండ్ అంటూ.. గిఫ్ట్‌ ప్యాకెట్‌ రూపంలో గంజాయి ఇచ్చి ఆమెను మోసం చేసినట్లు పోలీసులు విచారణలో కన్ఫామ్ చేసుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాలతో ఆ యువతిని వదిలిపెట్టారు.

అదేరోజు వినయ్‌కుమార్‌పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. పోలీసులకు చిక్కకుండా అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. కేసేమీ లేదని, కేవలం సమాచారం కోసం మాట్లాడాల్సి ఉందని జీఆర్పీ అధికారులు చెప్పగా.. గురువారం స్టేషన్‌కు వచ్చాడు. విచారణలో గంజాయిని గిఫ్ట్‌ ప్యాకెట్‌ రూపంలో ఇచ్చింది తానేనని ఒప్పుకున్నాడు. అతడిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.

Also Read: Viral Video: పాముకు సుస్సు పోయించిన ముంగిస.. వార్ వన్‌ సైడ్

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..