Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంతపురం జిల్లాలో దారుణం.. భార్య భర్తల మధ్య గొడవ.. మూడు నెలల చిన్నారిని చెరువులో పడేసిన తండ్రి..!

రోజురోజుకు దారుణాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. కొన్ని కొన్ని ఘటనలను మనస్సు తరుక్కుపోతున్నాయి. ఆడపిల్లలంటే ఈ సమాజంకు ఎందుకు ఇంత చిన్న చూపని..

అనంతపురం జిల్లాలో దారుణం.. భార్య భర్తల మధ్య గొడవ.. మూడు నెలల చిన్నారిని చెరువులో పడేసిన తండ్రి..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 22, 2021 | 12:07 PM

రోజురోజుకు దారుణాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. కొన్ని కొన్ని ఘటనలను మనస్సు తరుక్కుపోతున్నాయి. ఆడపిల్లలంటే ఈ సమాజంకు ఎందుకు ఇంత చిన్న చూపని ఆగ్రహం వస్తుంది. చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందని ఎక్కడో వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు చదివినప్పుడు లేదా చూసినప్పుడు తల్లిదండ్రులపై ఎక్కడ లేని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కళ్లు తెరిచి లోకం చూడకుండానే ఆ చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. మూడంటే మూడే నెలల ఆ చిన్నారిని కన్నతండ్రే చెరువులో పడేయడం అందరి మనసులను కలచివేస్తోంది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో చోటు చేసుకుంది.

బ్యాంకు ఉద్యోగి అయిన మల్లిఖార్జున్‌, చిట్టెమ్మ భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ అనంతరం భర్త భార్యను ఆస్పత్రిలో చేర్పించి మూడు నెలల పాపను  తీసుకెళ్లినట్లు భార్య ఆరోపిస్తోంది. అయితే తన పాపను భర్త మల్లీ చెరువులో పడేసినట్లు చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టగా, కళ్యాణదుర్గం సమీపంలో ఉన్న చెరువు వద్ద టవల్, టేప్ లభ్యమైది. అయితే చీకటి పడటంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Crime News: ‘ప్రేమించి మోసం చేశాడు’.. మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ట్రైనీ ఐఏఎస్‌పై కేసు నమోదు..

Aadhaar Hackathon 2021: ఆధార్‌ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో పాల్గొంటే రూ.3 లక్షలు గెలుచుకోవచ్చు.. కానీ వీరికి మాత్రమే

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!