AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: అనుపమ ఆలింగనం చేసుకున్న ఈ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా…?

అనుపమ పరమేశ్వరన్...  ఆమె అగరొత్తుల కురులను వలగా విసురుతోంది. కనికట్టుల చూపులతో మాయ చేస్తోంది.

Anupama Parameswaran: అనుపమ ఆలింగనం చేసుకున్న ఈ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా...?
Anupama
Ram Naramaneni
|

Updated on: Oct 22, 2021 | 1:51 PM

Share

అనుపమ పరమేశ్వరన్…  ఆమె అగరొత్తుల కురులను వలగా విసురుతోంది. కనికట్టుల చూపులతో మాయ చేస్తోంది. ఆమె పువ్వులకే రంగులు ఇచ్చే హరివిల్లు. చుక్కలకే మెరుపులనద్దే జాబిల్లి. నిద్దురలో కుర్రకారును కవ్వించే నెరజాన. ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అభినయం విషయంలో కూడా నేటి నటీమణుల్లో మేటి. ఇక ఫాలోయింగ్ అంటారా.. నెక్ట్స్ లెవల్. మళయాల ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ..  తెలుగులో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అ..ఆ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆపై వరసబెట్టి యంగ్ హీరోస్ పక్కన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కుటుంబానికి చెందిన ఆశిష్‌ను ‘రౌడీ బాయ్స్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలోని రెండో సాంగ్ లాంచ్ సందర్భంగా విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సమయంలో అక్కడే అనుపమ పరమేశ్వర్‌ను ఆత్మయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ ఫోటోను అనుపమ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. తను బాగమైన మూవీ ప్రచార కార్యక్రమానికి వచ్చినందుకు రౌడీ హీరోకు థ్యాంక్స్ చెప్పారు. కాగా ఈ ఫోటోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. మీరిద్దరూ కలిసి ఓ మూవీలో నటిస్తే చూడాలని ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అలా హగ్ చేసుకోకు విజయ్ అన్న అను నా పాప అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించాడు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Also Read: గంజాయి మత్తులో అశ్లీల దృశ్యాలు.. పోలీసుల ఆకస్మిక దాడులు.. ఇక ఉక్కుపాదమే

పైనుంచి చూస్తే పత్తి చేనే అనుకుంటారు… లోపలకు దిగి చెక్ చేసిన అధికారులు షాక్