Hyderabad: గంజాయి మత్తులో అశ్లీల దృశ్యాలు.. పోలీసుల ఆకస్మిక దాడులు.. ఇక ఉక్కుపాదమే

దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా... హైదరాబాద్‌లోనే లింకులు బయటపడుతున్నాయ్. హైదరాబాద్‌లో పబ్స్, క్లబ్స్ ...డ్రగ్స్‌కి కేరాఫ్‌గా మారిపోతున్నాయ్.

Hyderabad: గంజాయి మత్తులో అశ్లీల దృశ్యాలు.. పోలీసుల ఆకస్మిక దాడులు.. ఇక ఉక్కుపాదమే
Ganja
Follow us

|

Updated on: Oct 22, 2021 | 11:15 AM

దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా… హైదరాబాద్‌లోనే లింకులు బయటపడుతున్నాయ్. హైదరాబాద్‌లో పబ్స్, క్లబ్స్ …డ్రగ్స్‌కి కేరాఫ్‌గా మారిపోతున్నాయ్. డ్రగ్స్, గంజాయి కంట్రోల్‌కి సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నా …యువత మాత్రం మత్తుకు బానిసలవుతూనే ఉన్నారు.హైదరాబాద్‌లో గంజాయి పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్​నగర్ హార్స్ రైడింగ్ క్లబ్‌లో యువతీ యువకులు పార్టీ చేసుకున్నారు. గంజాయి సేవిస్తూ మత్తులో ఊగిపోయారు. గంజాయి మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తోన్న యువతీ యువకులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ యువతీ యువకుల నుంచి 20 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతీయువకులు గంజాయి సేవించినట్లు గుర్తించారు. ముందస్తు సమాచారంతో  సోదాలు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణను డ్రగ్ ప్రీ స్టేట్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. గంజాయి కంట్రోల్‌ కోసం పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించేందుకు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వచ్చిందన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక స్థితి దెబ్బతింటుందని… ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. డ్రగ్స్, గంజాయి వినియోగించే వారు ఎంతటివారైనా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. ఈ పీడను తొందరగా తొలగించకపోతే రాష్ట్రం సాధిస్తున్న విజయాలు, వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలన్నారు. సీఎం ఆదేశాలతో డ్రగ్స్ అండ్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు.

Also Read: Telangana: ‘అయ్యో పాపం’ అని లిఫ్ట్ ఇస్తే.. చుక్కలు చూపించారు

 సీమలో క్రేజీ సీన్.. నిన్నటిదాకా చినుకు జాడనే లేదు.. ఒక్కసారిగా కుండపోత.. ఆ తర్వాత