Samantha: సమంత పరువు నష్టం కేసులో ఏం తీర్పు రాబోతోంది? మరికాసేపట్లో..

సమంత పరువు నష్టం కేసులో ఏం తీర్పు రాబోతోంది? నష్టపరిహారం ఇప్పిస్తుందా? లేక క్షమాపణ, మందలింపుతో వదిలేస్తుందా? లేదంటే..

Samantha: సమంత పరువు నష్టం కేసులో ఏం తీర్పు రాబోతోంది? మరికాసేపట్లో..
Samantha Pic
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 22, 2021 | 10:20 AM

Actress Samantha Case: సమంత పరువు నష్టం కేసులో ఏం తీర్పు రాబోతోంది? నష్టపరిహారం ఇప్పిస్తుందా? లేక క్షమాపణ, మందలింపుతో వదిలేస్తుందా? లేదంటే సీన్ అరెస్టుల వరకూ వెళ్తుందా? ఇంతకీ, సమంత కోరుకుంటోన్న న్యాయం జరుగుతుందా? లేదా? చైతూతో డైవోర్స్ తర్వాత సమంత ఫస్ట్ టైమ్‌ కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం కావాలంటోంది. ఇంతకీ, సమంతకు జరిగిన అన్యాయమేంటి? ఆమె ఎలాంటి న్యాయం కోరుకుంటోంది? సామ్ మనోవేదనకు కారణమేంటి?

పిటిషన్‌ ద్వారా సమంత తన ఆవేదనను కోర్టుకు చెప్పుకుంది. విడాకుల ప్రకటన తర్వాత తనపై అసత్య ప్రచారం మొదలుపెట్టారు… నన్ను, నా క్యారెక్టర్‌ని కించపర్చారు… విడాకుల కోసం 300కోట్ల డీల్ కుదిరిందని తప్పుడు ప్రచారం చేశారు… నా డ్రెస్సింగ్‌పై వీడియోలు పెట్టి కించపర్చారు… అబార్షన్, అఫైర్స్ అంటూ తప్పుడు కథనాలు అల్లారంటూ తన ఆవేదనను కోర్టుకు చెప్పుకుంది సమంత.

తెలుగులో అత్యంత పాపులర్ నటిని… 45 సినిమాల్లో నటించా… 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 6 సౌతిండియా అవార్డులు, 3 సినీ మా అవార్డులు అందుకున్నా… 12 మల్టీ నేషనల్‌ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా… తెలంగాణ ప్రభుత్వానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశా… ఇంత పాపులరైన నన్ను కొందరు టార్గెట్ చేశారు. ఇదీ సమంత ఆవేదన.

ఇంతకీ, సామ్‌ ఏం కోరుకుంటోంది?… తన పరువును బజారుకీడ్చిన యూట్యూబ్ ఛానెల్స్‌తో బహిరంగ క్షమాపణలు చెప్పించాలంటోంది. అలాగే, తనకు లేనిపోని ఎఫైర్లు అంటగట్టిన డాక్టర్ సీఎల్‌ వెంకట్రావుపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటోంది. ఆ యూట్యూబ్ ఛానెల్స్ నుంచి లింకులు డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది. మరి, సమంత కోరుకున్న న్యాయం జరుగుతుందా? కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో కొద్దిసేపట్లో తేలిపోనుంది.

Samantha

Samantha

Read also: SBI ATM catches fire: ఎస్బీఐ ఏటీఎంలో మంటలు..