UAE Golden Visa: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న లెజెండరీ సింగర్ చిత్ర.. ఫోటో సోషల్ మీడియాలో షేర్

UAE Golden Visa: భారతీయ సినీ రంగ ప్రపంచంలో తన గానంతో గాత్రంతో స్పెషల్ ముద్ర వేసిన గాయని కే.ఎస్. చిత్ర. తన స్వరంలో అమృతం నింపుకున్న చిత్ర మలయాళం,..

UAE Golden Visa: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న లెజెండరీ సింగర్ చిత్ర.. ఫోటో సోషల్ మీడియాలో షేర్
Singer Chitra

UAE Golden Visa: భారతీయ సినీ రంగ ప్రపంచంలో తన గానంతో గాత్రంతో స్పెషల్ ముద్ర వేసిన గాయని కే.ఎస్. చిత్ర. తన స్వరంలో అమృతం నింపుకున్న చిత్ర మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ వంటి అనేక భాషల్లో తన గాత్రంతో అలరించింది. “దక్షిణ భారత నైటింగేల్” గా ప్రసిద్ధిగాంచిన లెజెండరీ సింగర్ చిత్ర. తన గానంతోనే కాదు.. మాటలతో కూడా మైమరిపిస్తుంది. తాజాగా యుఏఈ గోల్డెన్ వీసా దక్కించుకున్నారు చిత్ర. యూఏఈ గోల్డెన్‌ వీసా అందుకున్నట్టు స్వయంగా చిత్ర సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బుధవారం ఉదయం దుబాయ్ ఇమ్మిగ్రేషన్ చీఫ్ హెచ్‌ఇ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మారి చేతుల మీదుగా యుఎఇ గోల్డెన్ వీసా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని గాయని చిత్ర ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను చిత్ర సోషల్ మీడియాలో చేశారు.

కేరళలోని తిరువనంతపురంలో కృష్ణన్ నాయర్, శాంతకుమారి దంపతులకు 1963లో జూలై 27న చిత్ర జన్మించింది. సంగీతకారుల కుటుంబంలో జన్మించిన చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. కే. ఎస్. చిత్ర గా ఫేమస్ అయ్యింది. బాల్యంలో తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. మాతృభాష మలయాళంలో గాయనిగా గుర్తింపు పొందిన చిత్ర.. యావత్ దక్షిణాది పాటల ప్రేమికులను అలరించింది. 1986లో ‘సింధుభైరవి’ తమిళ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా చిత్ర అవార్డ్ అనుకున్నారు. ‘నఖశతంగల్’, హిందీ చిత్రం ‘విరాసత్’ ద్వారానూ గాయనిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకొని ‘హ్యాట్రిక్’ సాధించారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులను చిత్ర అందుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో అనేక వేలకు పైగా పాటలు పాడారు.

 

Also Read: మానవాళిపై పగబట్టిన వైరస్ లు .. అగ్రరాజ్యంలో కొత్త వ్యాధి.. ఉల్లిపాయే కారణం అంటున్న వైద్యులు’

 

Click on your DTH Provider to Add TV9 Telugu