Harassment: ట్రైనింగ్‌ కోసం వచ్చిన బాలికతో కోచ్‌ అసభ్యకర ప్రవర్తన…కేసు నమోదు చేసిన పోలీసులు..

శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు ఓ క్రికెట్‌ కోచ్‌. నిత్యం ఆ అమ్మాయి శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికంగా

Harassment: ట్రైనింగ్‌ కోసం వచ్చిన బాలికతో కోచ్‌ అసభ్యకర ప్రవర్తన...కేసు నమోదు చేసిన పోలీసులు..
Follow us

|

Updated on: Oct 22, 2021 | 4:23 PM

శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు ఓ క్రికెట్‌ కోచ్‌. నిత్యం ఆ అమ్మాయి శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు.  ఎంత వారించినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో  చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు కోచ్‌తో పాటు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పాండిచ్చేరి (సీఏపీ)కి చెందిన ఐదుగురు ప్రతినిధులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…పుదుచ్చేరికి చెందిన సీనియర్‌ క్రికెట్‌ ఆటగాడు, కోచ్‌ అయిన తమరైకన్నన్‌ వద్ద బాధితురాలు క్రీడా శిక్షణ కోసం చేరింది. అయితే అతను నిత్యం తనను అసభ్యంగా తాకే వాడని, లైంగికంగా వేధించేవాడని ఆ బాలిక పేర్కొంది. ప్రేమించాలని మెసేజ్‌ చేశాడు! ‘నన్ను ప్రేమిస్తున్నట్లు కోచ్‌ తమరైకన్నన్‌ మెసేజ్‌ చేశాడు. అతని ప్రేమను అంగీకరించకపోతే కోచింగ్‌ ఇవ్వనని కూడా బెదిరించాడు. నిత్యం నా శరీర భాగాలను అసభ్యంగా తాకుతూ ఎంతో అమర్యాదగా ప్రవర్తించాడు. ఎంత వారించినా వినికపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి అతను  భార్యతో నా ఇంటికి వచ్చాడు. పోలీసుల దగ్గరకు వెళ్లవద్దని ప్రాధేయపడ్డాడు. అయితే నేను మాత్రం అతనికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాను. అందుకే ఛైల్డ్‌లైన్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించాను’ అని బాధితురాలు వాపోయింది. బాలిక ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కోచ్‌తో పాటు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు సీఏపీ ప్రతినిధులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేశారు.

Also Read:

House Collapse: అర్ధరాత్రి కుప్పకూలిన రెండస్థుల భవనం.. నిద్రలోనే ఐదుగురు దుర్మరణం.. మరో ఆరుగురు..

Yogi Adityanath: సీఎం పర్యటనలో తుపాకీతో వ్యక్తి హల్‌చల్.. నలుగురు పోలీసుల సస్పెండ్.. యూపీలో కలకలం..

Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో వ్యాపించిన మంటలు.. చిక్కుకున్న జనాలు!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!