- Telugu News Photo Gallery Spiritual photos History and significance of Pashupatinath Temple in Kathmandu, Nepal
Pashupatinath Temple: ఆ దేశ ప్రజలకు శివుడు జాతీయ దైవం.. బంగారు రేకులతో ఆలయం.. హిందువులకు మాత్రమే ప్రవేశం.. విశిష్టత ఏమిటంటే
Pashupatinath Temple: హరహర మహాదేవ శంభోశంకర అంటూ నీటితో అభిషేకం చేసినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళ శంకరుడు.. ప్రపంచంలో అనేక ప్రక్షాత క్షేత్రాల్లో నేపాల్లోని ఖాట్మండులోని పశుపతి నాథ్ ఆలయం అత్యంతముఖ్యమైంది. ప్రపంచ ప్రఖ్యాత శైవక్షేత్రం మహిమాన్విత దేవుడు శివుడి విశిష్టత ఏమిటి.. ఎలా వెలిసాడు తెలుసుకుందాం..
Updated on: Oct 22, 2021 | 2:23 PM

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని బాగమతి నది ఒడ్డున ప్రఖ్యాత శివ క్షేత్రం ఉంది. ఇక్కడ శివుడు పశుపతి నాథ్ గా పూజలను అందుకుంటున్నాడు. భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు.

మూల విరాట్టు పశుపతి నాథ్ నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. ఇది శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం.. ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ ఆలయంలో అర్చకులుగా దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ , జంతు బలిని నిషేధించారు.

దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశం సంతాప తెలిజేస్తూ సంతాపసంద్రంగా ఉంటుంది. దీంతో అక్కడ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు

పశుపతి నాథ్ ఆలయ ముఖ ద్వారం వద్ద ఉన్న శివుడి వాహనం నంది ఆకట్టుకుంటుంది. బంగారు కవచంతో ఉంటుంది.

పశుపతినాథ్ దేవాలయ పగోడ రాత్రి సమయంలో వెలుగులు చిమ్ముతూ బంగారు రంగులో కాంతులీనుతూ కనిపిస్తూ అలరిస్తాయి. దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి, బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి. నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయబడి ఉంటుంది.

కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ్ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శిస్తారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం.. భక్తులు అపరమిత సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు

ఈ ఆలయాన నిర్మాణానికి సంబందించిన ఖచ్చితమైన ఆధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని.. పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తుంది.




